Courtesy: IPL Twitter
ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తన నిర్లక్ష్యం కారణంగా వికెట్ పారేసుకోవాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతిని పోలార్డ్ లాంగాన్ దిశగా ఆడాడు. ఇక్కడ ఈజీగా రెండు పరుగులు వచ్చే అవకాశం ఉంది. కానీ పొలార్డ్ పరుగు తీయాలా వద్దా అన్నట్లుగా నత్తనడకన సింగిల్ పూర్తి చేశాడు. అయితే అప్పటికే సూర్యకుమార్ సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం వస్తున్నాడు. ఇది గమనించని పొలార్డ్ కొన్ని సెకన్లు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్నాడు.
సూర్యను చూసి తేరుకున్న పొలార్డ్ రెండో పరుగుకు వెళ్లినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంతి అందుకున్న ఓడియన్ స్మిత్ కీపర్ జితేశ్ శర్మకు త్రో వేశాడు. పొలార్డ్ క్రీజులోకి చేరుకునేలోపే అతను వికెట్లను గిరాటేయడంతో రనౌట్ అయ్యాడు. పొలార్డ్ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. రెండు పరుగులు వచ్చే చోట ఒక పరుగుకే పరిమితం కావడం ఏంటని అభిమానులు దుమ్మెత్తి పోశారు. అప్పటికే సూర్య కారణంగా తిలక్ వర్మ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా సూర్య తప్పు లేదు.. తిలక్ వర్మ ఆవేశంగా పరిగెత్తి అనవసరంగా రనౌట్ అయ్యాడు.
చదవండి: IPL 2022: సూర్య తప్పు లేదు.. తిలక్‌వర్మదే దురదృష్టం
Comments
Please login to add a commentAdd a comment