Courtesy: IPL T20.COM
ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా పేరుపొందిన ముంబై ఇండియన్స్ క్రికెట్ సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టి జట్లను కొనుగోలు చేసింది. కొనుగోలు చేయడమే కాదు అందరికంటే ముందుగా తమ కొత్త జట్ల పేర్లను ప్రకటించడంతో పాటు ఆటగాళ్లను పరిచయం చేసింది. సీఎస్‌ఏ టి20 లీగ్‌లో 'ఎంఐ కేప్‌టౌన్'(MI Capetown).. యూఏఈ టి20 లీగ్‌లో 'ఎంఐ ఎమిరేట్స్'(MI Emirates)ను జట్లుగా ప్రకటించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్.
తాజాగా యూఏఈ ఇంటర్నేషనల్ టి20లో తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోయే జట్టును కూడా ప్రకటించింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఈ జట్టులో పెద్దపీట వేసింది. 14 మందితో కూడిన ఈ జట్టులో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్, విండీస్ మాజీ సారథి కీరన్ పొలార్డ్‌తో పాటు నికోలస్ పూరన్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ ఫ్లెచర్‌లు కూడా ఉన్నారు. ఇక ఐపీఎల్‌లో గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన ట్రెంట్ బౌల్ట్‌ను మళ్లీ జట్టులో చోటు కల్పించింది.
వీరితో పాటు ఇంగ్లండ్ నుంచి సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్ లు ఉన్నారు. అఫ్ఘనిస్తాన్ బౌలర్ జహీర్ ఖాన్, ఫజల్‌హక్ ఫరూఖీలను ఎంపిక చేసింది. సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు అవకాశం దక్కింది. ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ జట్టును తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్‌టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12వరకు జరగనుంది.
లీగ్ మార్గదర్శకాలను అనుసరించి తమ ఫ్రాంచైజీకి ఆటగాళ్లు ఒప్పందాలు చేసుకున్నారని, ఇక స్థానిక (యూఏఈ) క్రికెటర్లు కూడా వీరికి జతకలుస్తారని ఎంఐ ఎమిరేట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా జట్టు ఓనర్ ఆకాశ్ అంబానీ స్పందిస్తూ.. ‘మా జట్టుకు చెందిన 14 మంది ఆటగాళ్లను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడైన పొలార్డ్.. ఎమిరేట్స్‌లో మాతోనే కొనసాగుతున్నాడు. బ్రావో, బౌల్డ్, పూరన్ లు మళ్లీ మాతో చేతులు కలపనున్నారు. ఎమిరేట్స్ జట్టుకు ఆడబోయే ఆటగాళ్లకు స్వాగతం.’అని పేర్కొన్నాడు.
ఐఎల్‌టీ20కి ఎంఐ ఎమిరేట్స్ జట్టు: కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, అండ్రె ఫ్లెచర్, ఇమ్రాన్ తాహిర్, సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్, నజిబుల్లా జద్రాన్, జహీర్ ఖాన్, ఫరూఖీ, బ్రాడ్లే వీల్, బాడ్ డీ లీడే
The 𝗟𝗹𝗼𝗿𝗱, the 𝗟𝗲𝗴𝗲𝗻𝗱 & his 𝗟𝗲𝗴𝗮𝗰𝘆! @KieronPollard55 will don the iconic Blue and Gold in IL T20 💙
— Mumbai Indians (@mipaltan) August 12, 2022
🗞️ Read more: https://t.co/RMiQOJfj9N#OneFamily #MIemirates @MIEmirates @EmiratesCricket pic.twitter.com/C1flVytrpI
చదవండి: MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా..
Comments
Please login to add a commentAdd a comment