T20 cricket league
-
దంచికొట్టిన కరుణ్ నాయర్.. మహరాజా ట్రోఫీ మైసూర్దే!
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మహరాజా ట్రోఫీ-2024లో మైసూర్ వారియర్స్ చాంపియన్‌గా నిలిచింది. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన ఫైనల్లో 45 పరుగుల తేడాతో గెలుపొంది.. ట్రోఫీని ముద్దాడింది. ఈ టీ20 టోర్నీ ఆద్యంతం బ్యాటింగ్‌తో అదరగొట్టిన మైసూర్ వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 12 మ్యాచ్‌లలో కలిపి 560 పరుగులు సాధించి సూపర్ ఫామ్ కొనసాగించాడు.పోటీలో ఆరు జట్లుకాగా బెంగళూరు వేదికగా ఆగష్టు 15న మొదలైన మహరాజా ట్రోఫీ తాజా ఎడిషన్‌లో గుల్బర్గా మిస్టిక్స్, బెంగళూరు బ్లాస్టర్స్, మైసూర్ వారియర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, హుబ్లి టైగర్స్ జట్లు పాల్గొన్నాయి. వీటిలో గుల్బర్గ, బెంగళూరు, మైసూర్, హుబ్లి సెమీ ఫైనల్ చేరుకున్నాయి.ఫైనల్‌కు చేరుకున్న మైసూర్, బెంగళూరు జట్లుఅయితే, మొదటి సెమీస్ మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ గుల్బర్గాను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరగా.. రెండో సెమీ ఫైనల్లో హుబ్లి టైగర్స్‌పై తొమ్మిది పరుగుల తేడాతో గెలిచి మైసూర్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బెంగళూరు- మైసూరు మధ్య ఆదివారం రాత్రి టైటిల్ కోసం పోటీ జరిగింది.మనోజ్ భండాగే పరుగుల విధ్వంసంబెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బ్లాస్టర్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ కార్తిక్ 71, కెప్టెన్ కరుణ్ నాయర్ 66 అర్ధ శతకాలతో మెరవగా.. మిడిలార్డర్ బ్యాటర్ మనోజ్ భండాగే 13 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 338.46 కావడం గమనార్హం.ఫలితంగా మైసూర్ 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 207 పరుగులు స్కోరు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాటర్లు.. మైసూర్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 45 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించిన మైసూర్ వారియర్స్ ఈ ఏడాది టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ జట్టులో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా ఉన్నాడు. అయితే, ఫైనల్లో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. Mysuru hold out Bengaluru; clinch the TITLE!A Karun Nair-led #MysuruWarriors do it in style against #BengaluruBlasters in the Maharaja Trophy final 🏆🙌#MaharajaTrophy | #KarunNair | #MWvBB | #Final2024 pic.twitter.com/GbuDDJyHeV— Star Sports (@StarSportsIndia) September 1, 2024 -
జూనియర్ 'ఏబీడీ' విధ్వంసం.. 57 బంతుల్లో 162 పరుగులు
దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ టి20 క్రికెట్లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. సీఎస్ఏ చాలెంజ్ లీగ్‌లో భాగంగా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రెవిస్ 57 బంతుల్లోనే 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. 35 బంతుల్లోనే శతకం సాధించిన అతను ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేయగా, 52 బంతుల్లో 150 పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. గేల్ (175), ఫించ్ (172) తర్వాత టి20 క్రికెట్లో ఇది మూడో అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. కాగా బ్రెవిస్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. బ్రెవిస్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ పిళ్లై 52 పరుగులతో రాణించాడు. అనంతరం 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్స్ 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులకే పరిమితమైంది. తద్వారా నైట్స్‌పై 41 పరుగుల తేడాతో టైటాన్స్ విజయం సాధించింది. ఇక నైట్స్ బ్యాటర్లలో గిహాన్ క్లోయెట్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టైటాన్స్ బౌలర్లలో నైల్ బ్రాండ్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఆరోన్ ఫాంగిసో రెండు, బ్రెవిస్, హర్మర్ తలా వికెట్ సాధించారు. చదవండి: బంగ్లాదేశ్‌లో పర్యటించే టీమిండియా ఇదే.. తెలుగు ఆటగాడికి అవకాశం -
కేకేఆర్ ఫ్యామిలీలోకి ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ యూఈఏ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో అబుదాబి నైట్‌రైడర్స్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 14 మందితో కూడిన అబుదాబి నైట్‌రైడర్స్(ఏడీకేఆర్)జట్టును కేకేఆర్ యాజమాన్యం మంగళవారం తమ ట్విటర్లో ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడుతున్న ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లు యూఏఈ టి20లీగ్‌లోనూ అబుదాబి నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరితో పాటు ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్ స్టో, ఐర్లాండ్ విధ్వంసకర ఆటగాడు పాల్ స్టిర్లింగ్, లంక క్రికెటర్లు చరిత్ అసలంక, లాహిరు కుమారాలు ఉన్నారు.. కొలిన్ ఇంగ్రామ్, అకిల్ హొసేన్లు కూడా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ''క్రికెట్లో ప్రపంచవ్యాప్తంగా మా అడుగులు పడడం గొప్ప అచీవ్మెంట్ అన్ని చెప్పొచ్చు. ఐపీఎల్లో కేకేఆర్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో టీకేఆర్.. తాజాగా ఐఎల్టి20లో ఏడీకేఆర్. కేకేఆర్ జట్టులో ఉన్న ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లు ఏడీకేఆర్లో ఉండడం మాకు సానుకూలాంశం. ఇక కేకేఆర్ ఫ్యామిలీలోకి బెయిర్ స్టోకు స్వాగతం. ఐఎల్టి20లో ఏడీకేఆర్ తరపున బెయిర్ స్టో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటున్నాం. అలాగే లంక క్రికెటర్లు చరిత్ అసలంక, లాహిరు కుమారా.. ఐర్లాండ్ స్టార్ పాల్ స్టిర్లింగ్లకు కూడా గ్రాండ్ వెల్కమ్. కొలిన్ ఇంగ్రామ్, అకిల్ హొసేన్, రవి రాంపాల్ సహా ఇతర క్రికెటర్లకు కూడా స్వాగతం. ఐఎల్టి20 ద్వారా మేం గ్లోబల్ క్రికెట్లో విజయవంతమయ్యే ప్రయత్నంలో ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అబుదాబి నైట్‌రైడర్స్ టీం(ఏడీకేఆర్)'' అంటూ ముగించాడు. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరగనుంది. ఐఎల్టి 20 కోసం అబుదాబి నైట్ రైడర్స్ జట్టు: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, జానీ బెయిర్‌స్టో, పాల్ స్టిర్లింగ్, లహిరు కుమార, చరిత్ అసలంక, కోలిన్ ఇంగ్రామ్, అకేల్ హోసేన్,రేమాన్ రీఫర్, ఎస్ ప్రసన్న, రవి రాంపాల్, కెన్నార్ లూయిస్,అలీ ఖాన్, బ్రాండన్ గ్లోవర్ Welcome to the family, Knights 💜 https://t.co/mFNyF7a94T — KolkataKnightRiders (@KKRiders) August 16, 2022 చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు -
'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా పేరుపొందిన ముంబై ఇండియన్స్ క్రికెట్ సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టి జట్లను కొనుగోలు చేసింది. కొనుగోలు చేయడమే కాదు అందరికంటే ముందుగా తమ కొత్త జట్ల పేర్లను ప్రకటించడంతో పాటు ఆటగాళ్లను పరిచయం చేసింది. సీఎస్ఏ టి20 లీగ్‌లో 'ఎంఐ కేప్‌టౌన్'(MI Capetown).. యూఏఈ టి20 లీగ్‌లో 'ఎంఐ ఎమిరేట్స్'(MI Emirates)ను జట్లుగా ప్రకటించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్. తాజాగా యూఏఈ ఇంటర్నేషనల్ టి20లో తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోయే జట్టును కూడా ప్రకటించింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఈ జట్టులో పెద్దపీట వేసింది. 14 మందితో కూడిన ఈ జట్టులో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్, విండీస్ మాజీ సారథి కీరన్ పొలార్డ్‌తో పాటు నికోలస్ పూరన్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ ఫ్లెచర్‌లు కూడా ఉన్నారు. ఇక ఐపీఎల్లో గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన ట్రెంట్ బౌల్ట్‌ను మళ్లీ జట్టులో చోటు కల్పించింది. వీరితో పాటు ఇంగ్లండ్ నుంచి సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్ లు ఉన్నారు. అఫ్ఘనిస్తాన్ బౌలర్ జహీర్ ఖాన్, ఫజల్హక్ ఫరూఖీలను ఎంపిక చేసింది. సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు అవకాశం దక్కింది. ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ జట్టును తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12వరకు జరగనుంది. లీగ్ మార్గదర్శకాలను అనుసరించి తమ ఫ్రాంచైజీకి ఆటగాళ్లు ఒప్పందాలు చేసుకున్నారని, ఇక స్థానిక (యూఏఈ) క్రికెటర్లు కూడా వీరికి జతకలుస్తారని ఎంఐ ఎమిరేట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా జట్టు ఓనర్ ఆకాశ్ అంబానీ స్పందిస్తూ.. ‘మా జట్టుకు చెందిన 14 మంది ఆటగాళ్లను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడైన పొలార్డ్.. ఎమిరేట్స్‌లో మాతోనే కొనసాగుతున్నాడు. బ్రావో, బౌల్డ్, పూరన్ లు మళ్లీ మాతో చేతులు కలపనున్నారు. ఎమిరేట్స్ జట్టుకు ఆడబోయే ఆటగాళ్లకు స్వాగతం.’అని పేర్కొన్నాడు. ఐఎల్టీ20కి ఎంఐ ఎమిరేట్స్ జట్టు: కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, అండ్రె ఫ్లెచర్, ఇమ్రాన్ తాహిర్, సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్, నజిబుల్లా జద్రాన్, జహీర్ ఖాన్, ఫరూఖీ, బ్రాడ్లే వీల్, బాడ్ డీ లీడే The 𝗟𝗹𝗼𝗿𝗱, the 𝗟𝗲𝗴𝗲𝗻𝗱 & his 𝗟𝗲𝗴𝗮𝗰𝘆! @KieronPollard55 will don the iconic Blue and Gold in IL T20 💙 🗞️ Read more: https://t.co/RMiQOJfj9N#OneFamily #MIemirates @MIEmirates @EmiratesCricket pic.twitter.com/C1flVytrpI — Mumbai Indians (@mipaltan) August 12, 2022 చదవండి: MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా.. Mumbai Indians: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర.. -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్లు.. ఇదే తొలి సారి!
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా స్పిన్నర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో భారత స్పిన్నర్లు ఏకంగా 10కి 10 వికెట్లు పడగొట్టారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థి జట్టు మొత్తం 10 వికెట్లు స్పిన్నర్లు తీయడం ఇదే తొలి సారి. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు సాధించగా.. రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..ఫ్లోరిడా వేదికగా ఐదో టీ20లో విండీస్‌పై భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 188 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(40 బంతుల్లో 64 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపక్ హుడా 38 పరుగులు చేసి రాణించాడు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ భారత స్పిన్నర్ల ధాటికి 100 పరుగులకే కుప్ప కూలింది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు జట్టును భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
APL 2022: వైజాగ్ వారియర్స్ విజృంభణ.. చేతులెత్తేసిన గోదావరి టైటాన్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏడో మ్యాచ్‌లో స్పిన్నర్ల గింగిరాల బంతులకు బ్యాటర్లు చేతులెత్తేశారు. పేసర్లను చెండాడిన ఇరు జట్ల బ్యాటర్లు.. స్పిన్నర్లకే దొరికిపోయారు. వికెట్ కోల్పోకుండానే వైజాగ్ వారియర్స్ ఓపెనర్ల జోడి 29 బంతుల్లోనూ... గోదావరి టైటాన్స్ ఓపెనర్ల జోడి 30 బంతుల్లో అర్ధ సెంచరీలు నమోదు చేశాయి. టైటాన్ జట్టుకు చెందిన ఇస్మాయిల్ ఈ మ్యాచ్‌లో అత్యధికంగా లెగ్ బ్రేక్‌తో నాలుగు వికెట్లు తీయగా... వారియర్స్ జట్టుకు చెందిన ఆంజనేయులు మూడు, మల్లికార్జున రెండు వికెట్లను మణికట్టు మయాజాలంతో పడగొట్టారు. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన డే మ్యాచ్‌లో టాస్ గెలిచి గోదావరి టైటాన్స్ కెప్టెన్ శశికాంత్ వైజాగ్ వారియర్స్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. వారియర్ ఓపెనర్లు అశ్విన్(43), గిరినాథ్ (44) 9.3 ఓవర్ల వరకు ఆడి 98 పరుగులు చేశారు. పేసర్లను చెండాడిన ఈ జోడి... ఇస్మాయిల్ లెగ్ బ్రేక్‌కి దొరికిపోయింది. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన అశ్విన్ క్లీన్ బౌల్డ్ కాగా.. ఐదు ఫోర్లు, సిక్సర్ బాదిన గిరినాథ్ కూడా ఇస్మాయిల్ బౌలింగ్‌లోనే వికెట్ల వెనుక వంశీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టాప్ఆర్డర్లో వచ్చిన వేణు(10)ను క్లీన్ బౌల్డ్‌గా.. కరణ్ షిండే(8)ను లెగ్‌బిఫోర్‌గా ఇస్మాయిలే పెవిలియన్‌కు పంపాడు. శశికాంత్ బౌలింగ్‌లో నరేన్(25) డీప్ మిడ్ వికెట్లో సాత్విక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో వైజాగ్ వారియర్స్ ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. 53 పరుగులకే ఎనిమిది వికెట్లు ధాటిగానే ఆటను ప్రారంభించిన టైటాన్స్ తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించింది. ఓపెనర్ హేమంత్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 57 పరుగులు చేయగా మరో ఓపెనర్ వంశీకృష్ణ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. పేస్‌ను దీటుగా ఎదుర్కొంటున్న సమయంలో అశ్విన్ స్పిన్నర్లకు బంతిని అందించాడు. అంతే ఒక్కసారిగా ఆట తీరు మారిపోయింది. కేవలం 53 పరుగులకు టైటాన్స్ ఆటను ముగించాల్సి వచ్చింది. ఆంజనేయులు లెఫ్టార్మ్ స్పిన్‌తో ఆరు పరుగులే ఇచ్చి ముగ్గురిని పెవిలియన్‌కు పంపగా.. వేసిన నాలుగు ఓవర్లలో రెండు మేడిన్లు కావడం విశేషం. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ మల్లికార్జున రెండు వికెట్లు తీశాడు. 7.3 ఓవర్లకు 88 పరుగుల వద్ద తొలి వికెట్ పడగా 20 ఓవర్లలో 141 పరుగులకే టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 44 పరుగుల తేడాతో వారియర్స్ విజయం సాధించింది. ఇస్మాయిల్ ఎనిమిది పరుగుల(ఒక ఫోర్)తో చివరి వికెట్‌కు నిలవడంతో ఆలౌట్ కాకుండా టైటాన్స్ కాపాడుకోగలిగారు. సందీప్(15) రెండంకెల స్కోర్ చేయగలిగాడు. వేణు, మనోహార్ చెరో వికెట్ తీసి జట్టు విజయానికి సహకరించారు. బెస్ట్ బౌలర్, మ్యాచ్ బెస్ట్‌గా ఆంజనేయులు, బెస్ట్ బ్యాటర్‌గా హేమంత్ నిలిచారు. ఆధిక్యంలో బెజవాడ టైగర్స్ విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్‌లో నాలుగో రోజు మ్యాచ్‌లు ముగిసేప్పటికి రెండే మ్యాచ్‌లాడినా బెజవాడ టైగర్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడేసి మ్యాచ్‌లాడిన ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్ జట్లతో టైగర్స్ ఆరేసి పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్‌రేట్‌తో ఆధిక్యంలో నిలిచింది. శనివారం మ్యాచ్‌లో విజయంతో కోస్టల్ రైడర్స్ నాలుగు పాయింట్లు(మూడు మ్యాచ్‌ల్లో) సాధించడంతో ఐదో స్థానానికి చేరుకోగా.. రెండు మ్యాచ్‌లాడిన వైజాగ్ వారియర్స్ నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతోంది. తడబడిన లయన్స్ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కోస్టల్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఉత్తరాంధ్ర లయన్స్ కెప్టెన్ భరత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు ఫీల్డింగ్‌నే ఎంచుకోగా.. అందుకు భిన్నంగా భరత్ తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. దానికి తగ్గట్టుగానే ఓపెనింగ్ జోడి తొలి వికెట్‌ను 10.3 ఓవర్ల వరకు చేజార్చుకోకుండానే 89 పరుగులు చేసింది. అర్ధసెంచరీ చేసిన భరత్ (52, నాలుగేసి ఫోర్లు, సిక్సర్లతో) శ్రీనివాస్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రెండు పరుగులు జత చేసి మరో ఓపెనర్ క్రాంతి(32) శ్రీనివాస్ వేసిన బంతిని ఆడబోయి కెప్టెన్ జ్ఞానేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో 42 పరుగులు చేసిన లయన్స్ ఎనిమిది వికెట్లకు 133 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. ముగ్గురు రనౌట్‌గానే వెనుదిరిగారు. ఆఫ్‌బ్రేక్‌తో శ్రీనివాస్ మూడు వికెట్లు తీయగా స్టీఫెన్, తపస్వి చెరో వికెట్ తీశారు. రైడర్స్ దూకుడు దూకుడుగానే ఆటను ప్రారంభించిన కోస్టల్ రైడర్స్ ఓపెనర్లు మొదటి మూడు ఓవర్లలో 37 పరుగులు రాబట్టారు. ఈ స్థితిలో షోయబ్ వేసిన తొలి బంతికి ప్రణీత్(24, నాలుగు ఫోర్లు, సిక్సర్) లెగ్‌బిఫోర్‌గా ఔటయ్యాడు. నాలుగో బంతికి కెప్టెన్ జ్ఞానేశ్వర్(11, రెండు ఫోర్లతో)ను బౌల్డ్ చేశాడు. టాప్ ఆర్డర్లో మునీష్, హర్ష నిలకడగా ఆడి స్కోర్‌ను 50(5.5 ఓవర్లలో) పరుగులకు చేర్చారు. టాప్ మిడిలార్డర్లో కీపర్ బ్యాటర్ లేఖజ్ 32 పరుగులతో(27 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో), తపస్వి 43 పరుగులతో (21 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) నిలిచి జట్టుకు విజయాన్నందించారు. వీరి జోడి 12.1 ఓవర్లలోనే స్కోర్‌ను వంద పరుగుల మార్కుకు చేర్చింది. రైడర్స్ 15 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఆఫ్‌బ్రేక్‌తో షోయబ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. వర్మ ఒక వికెట్ తీశాడు. తపస్వి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. బెస్ట్ బ్యాటర్‌గా భరత్, బెస్ట్ బౌలర్‌గా షోయబ్‌ఖాన్ నిలిచారు. -
క్రికెట్లో అడుగుపెట్టనున్న ఉసేన్ బోల్ట్.. ఏ లీగ్‌లో ఆడనున్నాడంటే!
Usain Bolt set to play T20 cricket..?: ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత, జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ త్వరలో తన కలను సాకారం చేసుకోనున్నాడు. చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన క్రికెట్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో త్వరలో నిర్వహించబోతున్న ఓ టీ20 లీగ్ లో బోల్ట్ పాల్గోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ భారత డిజిటల్ స్పోర్ట్స్ ఛానల్ ఈ లీగ్ కోసం బోల్ట్‌ను సంప్రదించున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరికొద్దిరోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. కాగా బోల్ట్ ఎనిమిది సార్లు ఒలిపింక్స్‌లో బంగారు పతక విజేతగా నిలిచాడు. అదే విధంగా 2009 బెర్లిన్‌లో జరిగిన ఐఏఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్లను 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఇదే ప్రస్తుతం ప్రపంచ రికార్డును కలిగి ఉంది. కాగా ఇటీవల రన్నింగ్ నుంచి బోల్ట్ రిటైర్మ్మెంట్ ప్రకటించాడు. అయితే చాలా సందర్బాల్లో క్రికెట్ అంటే ఇష్టమని బోల్ట్ తెలిపాడు . తన తండ్రి కోరికకు తలొగ్గి రన్నింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నానని, క్రికెట్ ఎప్పుడూ తన ‘ఫస్ట్ లవ్’ అని బోల్ట్ చాలా సందర్బాల్లో వెల్లడించాడు. కాగా క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ సూపర్ స్టార్లు జమైకాకు చెందినవారే. చదవండి: Ben Stokes 56 Number Armband: 56వ నెంబర్‌తో బరిలోకి.. నాన్నకు ప్రేమతో -
అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లో ఉన్ముక్త్ చంద్.. తొలి మ్యాచ్‌లోనే డకౌట్
కాలిఫోర్నియా: భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత అండర్–19 జట్టు మాజీ కెప్టెన్, ఢిల్లీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో రెండేళ్ల ఒప్పందం చేసుకున్నాడు. ఎంఎల్‌సీలో భాగంగా కాలిఫోర్నియాలో శనివారం మొదలైన టయోటా మైనర్ లీగ్ టి20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో 28 ఏళ్ల ఉన్ముక్త్ సిలికాన్ వ్యాలీ స్ట్రయికర్స్ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. సాన్‌డియాగో సర్ఫ్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ మూడు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉన్ముక్త్ చంద్ జట్టు(సిలికాన్ వ్యాలీ స్ట్రయికర్స్) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. షెహాన్ జయసూర్య(74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాన్‌డియాగో సర్ఫ్ రైడర్స్ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఈ లీగ్‌లో ఉన్ముక్త్ చంద్ సహా చాలామంది ఇండో అమెరికన్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. -
పరిగెత్తుతూ కిందపడ్డాడు; రనౌట్‌కు అవకాశమున్నా..
మాంచెస్టర్: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ టీ20 బ్లాస్ట్ క్రికెట్లో క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం యార్క్‌షైర్, లంకాషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. లంకాషైర్ ఇన్నింగ్స్ మధ్యలో లూక్ వెల్స్ మిడాఫ్ మీదుగా షాట్ ఆడి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న స్టీవెన్ క్రాప్ట్‌కు కాల్ ఇచ్చాడు. అయితే క్రాప్ట్ పరుగు కోసం యత్నించి పట్టుతప్పి క్రీజు మధ్యలోనే కిందపడ్డాడు. కాలు పిక్క పట్టేయడంతో క్రాప్ట్ నొప్పితో విలవిల్లాడాడు. అయితే అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ కీపర్ హ్యారీ డ్యూక్‌కు అందించాడు. ఇక్కడ బ్యాట్స్‌మన్ రనౌట్‌కు అవకాశమున్నా కెప్టెన్ రూట్ డ్యూక్‌ను వద్దంటూ వారించాడు. కాగా గాయపడిన క్రాప్ట్ను పక్కకు తీసుకెళ్లి ఫిజియోతో చికిత్స చేయించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూట్ చేసిన పనికి నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు. కెప్టెన్ అనే పదానికి రూట్ సరైన నిర్వచనం... ఇది అసలైన క్రీడాస్ఫూర్తి.. అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లంకాషైర్ 4 వికెట్ల తేడాతో యార్క్‌షైర్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 32, బాలన్స్ 31, విల్ ప్రెయిన్ 22* పరుగులు చేశారు. లంకాషైర్ బౌలింగ్‌లో లూక్ వుడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకాషైర్ మరో ఆరు బంతులు మిగిలి ఉండగా.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. లంకాషైర్ ఇన్నింగ్స్‌లో స్టీవెన్ క్రాప్ట్ 26 నాటౌట్, లూక్ వెల్స్ 30 పరుగులు చేసి జట్టును గెలిపించారు. What would you have done? Croft goes down injured mid run and @YorkshireCCC decide not to run him out#Blast21 pic.twitter.com/v1JHVGLn1T — Vitality Blast (@VitalityBlast) July 17, 2021 -
విండీస్ పవర్ హిట్టర్‌కు కరోనా..
లండన్: గత రెండేళ్లుగా వెస్టిండీస్ టీమ్‌కి దూరంగా ఉంటూ, విదేశీ టీ20 లీగ్స్‌లో బిజీగా గడుపుతున్న పవర్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వైట్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో వార్విక్‌షైర్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్న బ్రాత్వైట్కు.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ కౌంటీ యాజమాన్యం ప్రకటించింది. దీంతో నిన్న నాటింగ్హమ్షైర్తో జరిగిన మ్యాచ్‌కి అతని స్థానంలో రోబ్ యాట్స్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు. టీ20 బ్లాస్ట్ టోర్నీ నిబంధనల ప్రకారం.. కరోనా పాజిటివ్‌గా తేలిన క్రికెటర్ 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. దీంతో జులై 9న జరిగే మ్యాచ్‌కి కూడా ఈ స్టార్ పవర్ హిట్టర్ దూరంగా ఉంటాడని జట్టు యాజమాన్యం ప్రకటించింది. కాగా, ప్రస్తుత టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన బ్రాత్‌వైట్.. 18 వికెట్లు పడగొట్టి, 104 పరుగులు చేశాడు. 2016 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో చివరి ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాది వెస్టిండీస్‌ని గెలిపించిన కార్లోస్ బ్రాత్‌వైట్.. ఆ టోర్నీ తర్వాత కెప్టెన్‌గా కరీబియన్ జట్టును కూడా నడిపించాడు. అయితే, 2019 నుంచి అతని కెరీర్ గాడి తప్పిడంతో జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. -
ఐదేళ్ల నాటి పగకు ప్రతీకారం తీర్చుకున్న బెన్ స్టోక్స్..
లండన్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఘోర పరాభవానికి.. ఐదేళ్ల తర్వాత లెక్క అప్పజెప్పాడు. వివరాల్లోకి వెళితే.. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ తుది పోరులో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జో రూట్(54), జోస్ బట్లర్(36), డేవిడ్ విల్లీ(21) పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో బ్రావో, బ్రాత్‌వైట్ తలో మూడు వికెట్లు తీశారు. Stokesy sends it into the stands 6⃣ Durham 41/2 after the powerplay. #ForTheNorth pic.twitter.com/a9fRAImyhg — Durham Cricket (@DurhamCricket) June 26, 2021 అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుని రెండోసారి పొట్టి ఫార్మాట్లో ఛాంపియన్‌గా అవతరించింది. 12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇంగ్లీష్ బౌలర్ క్రిస్ జోర్డాన్ వేసిన 19వ ఓవర్లో శాముల్స్, బ్రాత్‌వైట్‌లు తడబడ్డారు. దీంతో చివరి ఓవర్లో విండీస్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో వరుసగా నాలుగు బంతులను భారీ సిక్సర్లుగా మలిచిన బ్రాత్‌వైట్ విండీస్‌కు అపురూప విజయాన్ని అందించాడు. ఈ మెగా ఈవెంట్ తర్వాత స్టోక్స్, బ్రాత్‌వైట్ ప్రత్యర్థులుగా ఎక్కువగా ఎదురుపడలేదు. అయితే బ్రాత్‌వైట్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం స్టోక్స్‌కు టీ20 బ్లాస్ట్ రూపంలో వచ్చింది. ఈ లీగ్‌లో భాగంగా డర్హమ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్.. వార్విక్షైర్ ఆటగాడు, విండీస్ ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్ వేసిన ఒక ఓవర్లో వరుసగా 6,4,0,6 బాదేశాడు. ఐదేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకున్నాడు. బ్రాత్వైట్లా వరుస సిక్స్‌లు బాదే అవకాశం రానప్పటికీ.. అతనిలానే భారీ షాట్లు ఆడుతూ ఒకే ఓవర్లో 16 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులను ఎదుర్కొన్న స్టోక్స్.. 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేయడంతో డర్హమ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం వార్విక్షైర్ 18.3 ఓవర్లలోనే 130 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది. కాగా, ఐపీఎల్ 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలో నిలిచిన స్టోక్స్.. చేతి వేలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. -
అంపైర్ ఔటివ్వలేదని వికెట్లు పీకి పాడేసిన స్టార్ క్రికెటర్..
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్రికెట్ సమాజం తలదించుకునే పని చేశాడు. అంపైర్ ఔటివ్వలేదని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌ను దుర్భాషలాడుతూ అతనిపైకి దూసుకెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్‌లో భాగంగా అబహాని లిమిటెడ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో మహమ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుకు ప్రాతనిధ్యం వహిస్తున్న షకీబ్ అల్ హసన్.. అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి లోనై వికెట్లను తన్నడంతో పాటు అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. Shit Shakib..! You cannot do this. YOU CANNOT DO THIS. #DhakaLeague It’s a shame. pic.twitter.com/WPlO1cByZZ — Saif Hasnat (@saifhasnat) June 11, 2021 వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన షకీబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అబహాని లిమిటెడ్ జట్టు ఆచితూచి ఆడుతున్న క్రమంలో, షకీబ్ ఐదో ఓవర్ బౌల్ చేశాడు. ఈ ఓవర్లో తొలి రెండు బంతులను అబహాని బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. అయితే, ఆ మరుసటి బంతి ముష్ఫికర్ బ్యాట్‌ను మిస్ అయి ప్యాడ్లను తాకింది. దీంతో ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేసిన షకీబ్.. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో సహనం కోల్పోయాడు. ఆగ్రహంతో అతనిపైకి దూసుకెళ్తూ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను గట్టిగా తన్నాడు. కాగా, షకీబ్ ఇదే మ్యాచ్‌లో మరోసారి అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురయ్యాడు. One more... Shakib completely lost his cool. Twice in a single game. #DhakaLeague Such a shame! Words fell short to describe these... Chih... pic.twitter.com/iUDxbDHcXZ — Saif Hasnat (@saifhasnat) June 11, 2021 ప్రత్యర్ధి విజయం దాదాపు ఖరారైన సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతను.. మరోసారి అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. ఇంతటితో ఆగకుండా అంపైర్‌ను దుర్భాషలాడుతూ, వికెట్లను పీకి పారేశాడు. కాగా, షకీబ్ వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా, స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన షకీబ్.. యువ క్రికెటర్లకు స్పూర్తిగా నిలవాల్సింది పోయి, ఇలా దురుసుగా ప్రవర్తించడం సిగ్గు చేటని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే షకీబ్ ఇలా ప్రవర్తించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ తరహా ప్రవర్తనతోనే మందలింపుకు గురయ్యాడు. అయితే తాజా వీడియోలపై బంగ్లా క్రికట్ బోర్డు స్పందిస్తే మాత్రం అతనిపై కఠిన చర్యలు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: నట్టూ, శ్రేయస్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణం అదేనా.. -
బ్రావో... 500 వికెట్లు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : క్రికెట్లో 24 గంటల వ్యవధిలో రెండు అరుదైన ఘనతలు నమోదయ్యాయి. మంగళవారం సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ 600 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందగా.... బుధవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో టి20 క్రికెట్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నమెంట్లో భాగంగా బుధవారం సెయింట్ లూసియా జూక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న డ్వేన్ బ్రావో ఈ ఘనత అందుకున్నాడు. రఖీమ్ కార్న్‌వాల్‌ను అవుట్ చేయడం ద్వారా బ్రావో టి20 క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అనంతరం రోస్టన్ చేజ్‌ను కూడా అవుట్ చేసి బ్రావో తన వికెట్ల సంఖ్యను 501కు పెంచుకున్నాడు. సెయింట్ లూసియా జూక్స్ జట్టు 17.1 ఓవర్లలో 6 వికెట్లకు 111 పరుగుల వద్ద ఉన్నపుడు వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం తగ్గుముఖం పట్టాక ట్రిన్‌బాగో జట్టు లక్ష్యాన్ని 9 ఓవర్లలో 72 పరుగులుగా నిర్ణయించారు. ట్రిన్‌బాగో 8 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో నెగ్గి ఈ లీగ్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. 2006లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టి20 క్రికెట్లో అరంగేట్రం చేసిన బ్రావో గత 14 ఏళ్లలో అంతర్జాతీయ, ప్రొఫెషనల్ లీగ్స్‌తో కలిపి 459 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 501 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ 390 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న పలు టి20 లీగ్స్‌లో ప్రముఖ జట్లకు ఆడిన బ్రావో... చాంపియన్స్ లీగ్ (2009–10; ట్రినిడాడ్ అండ్ టొబాగో 12 వికెట్లు), ఐపీఎల్ (చెన్నై సూపర్ కింగ్స్–2013లో 32 వికెట్లు; 2015లో 26 వికెట్లు), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో–2015లో 28 వికెట్లు; ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్–2016లో 21 వికెట్లు), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఢాకా డైనమైట్స్–2016–2017; 21 వికెట్లు), బిగ్‌బాష్ లీగ్ (మెల్బోర్న్ రెనెగెడ్స్–2017–2018; 18 వికెట్లు)లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. -
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు మరోసారి..
-
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు మరోసారి..
క్రిస్ట్‌చర్చ్: ఇప్పటివరకూ టీ20 క్రికెట్లో యువరాజ్ సింగ్, రాస్ వైట్లీ, హజ్రుతుల్లా జజాయ్‌లు మాత్రమే ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు సాధించగా, గ్యారీ సోబర్స్, రవిశాస్త్రిలు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు సాధించారు. ఇక హెర్షలీ గిబ్స్ వన్డే ఫార్మాట్లో ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు వీరి సరసన న్యూజిలాండ్ క్రికెటర్ లియో కార్టర్ చేరిపోయాడు. ఫలితంగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ఆ ఫీట్ సాధించిన ఏడో క్రికెటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ సూపర్ స్మాష్ టీ20 లీగ్‌లో భాగంగా కాంటర్బరీ కింగ్ -నార్తరన్ నైట్స్‌ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో కాంటర్బరీ బ్యాట్స్‌మన్ అయిన లీయో కార్టర్ విశ్వరూపం ప్రదర్శించాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, ఇన్నింగ్స్ 16 ఓవర్లో లియో కార్టర్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి జట్టు స్పిన్నర్ అంటోన్ డెవ్‌సిచ్ బౌలింగ్‌లో కార్టర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో తొలి సిక్స్‌ను బ్యాక్వర్డ్ స్వ్కేర్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టగా, రెండు, మూడు బంతుల్ని మిడ్ వికెట్ మీదుగా సిక్స్‌గా మలచాడు. ఇక నాల్గో బంతిని డీప్ స్వ్కేర్ లెగ్ వైపు సిక్స్ కొట్టగా, ఐదో బంతిని లాంగాన్ దిశగా సిక్స్‌గా కొట్టాడు. ఆరో బంతిని డీప్ స్క్వేర్ లెగ్‌లో మరో సిక్స్ కొట్టి రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా నార్తరన్ నైట్స్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని కాంటర్బరీ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇప్పుడు లియో కార్టర్ కొట్టన సిక్సర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
గేల్ మెరుపులు.. ఆకాశంలో ఉరుములు!
ఒంటారియో: టీ20 స్పెషలిస్ట్, యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ మళ్లీ గర్జించాడు. విదేశీ లీగ్‌ల్లో భాగంగా గ్లోబల్ టీ20 కెనడాలో వాన్కూవర్ నైట్స్ తరఫున ఆడుతున్న గేల్ విశ్వరూపం ప్రదర్శించాడు. సోమవారం మోంట్రియల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ బౌండరీల మోత మోగించాడు. 54 బంతుల్లో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 122 పరుగులు సాధించాడు. మోంట్రియల్ బౌలర్లను ఊచకోత కోస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి వికెట్‌కు విస్సే(51)తో కలిసి 63 పరుగులు జత చేసిన గేల్.. చెడ్విక్ వాల్టన్‌తో కలిసి మరో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పే క్రమంలో నెమ్మదిగా ఆడిన గేల్.. ఆపై రెచ్చిపోయి ఆడాడు. మూడో వికెట్‌కు వాన్ దెర్ డస్సెన్(56)తో కలిసి 139 పరుగుల భారీ భాగస్వామ్యం సాధించడంలో దోహదపడ్డాడు. దాంతో వాన్కూవర్ నైట్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు సాధించింది. ఇది టీ20 చరిత్రలో రెండో అత్యధిక స్కోరుగా నమోదైంది. టాప్ ప్లేస్‌లో అఫ్గానిస్తాన్ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ 278 పరుగులు చేసింది. ఫలితంగా టీ20ల్లో అత్యధిక స్కోరు రికార్డు అఫ్గాన్ పేరిట లిఖించబడింది. ఆ తర్వాత వాన్కూవర్ నైట్స్దే టీ20ల్లో అత్యధిక స్కోరు.కాగా, వాన్కూవర్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే అవకాశం మోంట్రియల్ టైగర్స్‌కు రాలేదు. గేల్ గర్జన తర్వాత ఆకాశంలో ఉరుములు, మెరుపులు కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశారు. దాంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. -
సెమీస్‌లో హైదరాబాద్ థండర్‌బోల్ట్స్
సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ థండర్‌బోల్ట్స్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. జింఖానా మైదానంలో గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 34 పరుగుల తేడాతో ఎంఎల్ఆర్ రాయల్స్ మహబూబ్‌నగర్‌పై ఘన విజయాన్ని సాధించింది. ఇది హైదరాబాద్‌కు వరుసగా ఎనిమిదో విజయం. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‌లాడిన థండర్‌బోల్ట్స్ 16 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. 14 పాయింట్లతో రంగారెడ్డి రైజర్స్ రెండో స్థానానికి చేరగా... 12 పాయింట్లు సాధించిన ఆదిలాబాద్ టైగర్స్, మెదక్ మావెరిక్స్ జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాలను దక్కించుకుని సెమీస్‌లో అడుగుపెట్టాయి. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ చందన్ సహాని (43 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. ప్రిన్స్ (35; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం మహబూబ్‌నగర్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. కార్తీక్ ఆనంద్ (42; 4 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. హైదరాబాద్ బౌలర్లలో జయరామ్ రెడ్డి, పుష్కర్ చెరో 2 వికెట్లు తీశారు. చందన్ సహానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం లభించింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు ఆదిలాబాద్ టైగర్స్: 133/8 (మీర్ జావిద్ అలీ 52; త్రిషాంక్ గుప్తా 3/17), ఖమ్మం టిరా: 72 (ముకేశ్ 25; రవితేజ 2/19, హితేశ్ యాదవ్ 3/7). మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: మీర్ జావిద్ అలీ. నిజామాబాద్ నైట్స్: 161/9 (అనురాగ్ హరిదాస్ 57; శ్రీకరణ్ 3/28), కరీంనగర్ వారియర్స్: 116 (అశ్విని బాబు 35; అనురాగ్ హరిదాస్ 3/22). నల్లగొండ లయన్స్: 157/6 (క్రితిక్ రెడ్డి 51, తేజోధర్ 36), కాకతీయ కింగ్స్: 109 (భానుప్రకాశ్ 32; తేజోధర్ 3/19). మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: క్రితిక్ రెడ్డి. -
రంగారెడ్డి రైజర్స్ జోరు
సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ జట్టు జోరు ప్రదర్శిస్తోంది. సిద్దిపేట్లో శనివారం జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్ నైట్స్‌పై 13 పరుగుల తేడాతో రంగారెడ్డి రైజర్స్ గెలుపొందింది. ఈ టోర్నీలో రంగారెడ్డి రైజర్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. టాస్ గెలిచిన నిజామాబాద్ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా... అఖిల్ అక్కినేని సారథ్యంలోని రంగారెడ్డి రైజర్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. బ్యాట్స్‌మెన్ షేక్ సొహైల్ (43 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రతీక్ పవార్ (30 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో రంగారెడ్డి 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లలో వై. శ్రవణ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అనంతరం నిజామాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బి. సూరజ్ నాయక్ (34 బంతుల్లో 46; 8 ఫోర్లు), రాహుల్ సింగ్ గెహ్లాట్ (11 బంతుల్లో 22; 2 ఫోర్లు), వంశీ కృష్ణ (22; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. రంగారెడ్డి బౌలర్లలో వీకేఎస్ ఆశిష్ 4 వికెట్లు దక్కించుకున్నాడు. హైదరాబాద్ బోణీ నల్లగొండ లయన్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ శ్రీనిధియాన్ థండర్‌బోల్ట్స్ జట్టు 3 పరుగుల తేడాతో గెలిచి విజయాల బోణీ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు సాధించింది. చందన్ సహాని (37 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డానీ ప్రిన్స్ (20; 3 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సాయి అభినయ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం నల్లగొండ లయన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు చేసి ఓడిపోయింది. ఆశిష్ రెడ్డి (31; 3 ఫోర్లు, 1 సిక్స్), ఎ. వరుణ్ గౌడ్ (31; 4 ఫోర్లు), శశిధర్ రెడ్డి (30; 1 ఫోర్, 3 సిక్సర్లు) పరవాలేదనిపించారు. హైదరాబాద్ బౌలర్లలో సూర్య ప్రసాద్, పుష్కర్ వల్లూర్ చెరో 2 వికెట్లు తీశారు. -
30న తెలంగాణ టీ20 సెలక్షన్స్
హైదరాబాద్: తెలంగాణ టీ20 టోర్నీలో పాల్గొనే రంగారెడ్డి జిల్లా జట్టు కోసం ఆటగాళ్ల ఓపెన్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా క్రికెట్ అసోసియేన్ కో ఆర్డినేటర్ జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న ఉదయం 8 గంటల నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో తెలంగాణ టీ20 క్రికెట్ లీగ్ కోసం ఆటగాళ్ల ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. 16 నుంచి 28 సంవత్సరాల వయస్సు కల్గిన రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లా ఆటగాళ్లు ఎంపిక ప్రక్రియకు హాజరు కావచ్చని చెప్పారు. ప్రతీ ఒక్కరు స్థానికతను రుజువు చేసే ఆధార్ కార్డు తీసుకురావాలని ఆయన కోరారు. -
నేను ‘కూలీ’ని కాదు!
క్రిస్ గేల్ ఆవేదన జమైకా: ఒక వైపు ఐపీఎల్, మరోవైపు బిగ్‌బాష్, ఒకసారి కరీబియన్ లీగ్, మరోసారి బంగ్లా లీగ్... ఇలా ప్రపంచం మొత్తం టి20 క్రికెట్ లీగ్‌లలో ఎక్కువగా కనిపించే ఆటగాడు క్రిస్ గేల్. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ ఫార్మాట్లో సూపర్ స్టార్‌గా ఉన్న గేల్ చివరకు జింబాబ్వేలోని 20 సిరీస్ లీగ్ టోర్నీలో కూడా పాల్గొన్నాడు. అయితే వెస్టిండీస్ జట్టు తరఫున మాత్రం అతను రెగ్యులర్‌గా ఆడటం లేదు. గాయంతోనో, మరో కారణంతోనే చాలా సందర్భాల్లో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దీనిని దృష్టిలో ఉంచుకొని అతడిని అంతా ‘టి20 కూలీ’ (మెర్సినరీ)గా విమర్శిస్తున్నారు. సొంత దేశం తరఫున కాకుండా డబ్బు ఇస్తే పరాయి దేశం తరఫున కూడా యుద్ధం చేసే సిపాయిని మెర్సినరీగా వ్యవహరిస్తారు. కేవలం డబ్బు కోసమే పని చేయడం వీరి లక్షణం. అయితే ఈ విమర్శపై గేల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెటర్లను అలా పిల వడం తనను బాధిస్తోందని అతను అన్నాడు. ‘ఆటగాళ్లను అలా అనడం దురదృష్టకరం. దీని వల్ల అతనితో పాటు క్రికెట్ గౌరవాన్ని కూడా తగ్గిస్తున్నారు. మమ్మల్ని ‘మెర్సినరీ’గా పిలవద్దు. అదనపు సంపాదన, కుటుంబ పోషణ కోసం డబ్బు సంపాదించుకునేందుకు మాకు ఇది ఉపయోగపడుతుంది. నాతో పాటు ప్రపంచంలో చాలా మంది క్రికెటర్లు ఇదే చేస్తున్నారు’ అని గేల్ వాపోయాడు. ప్రతీ ఆటగాడికి దేశం తరఫున ఆడాలనే ఉంటుందని, అయితే ఆర్థికపరమైన భద్రత కోసమే లీగ్‌లపై దృష్టి పెడుతున్నారని అతను అన్నాడు.