ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు మరోసారి.. | Carter Hits 6 Sixes In An Over In New Zealand T20 League | Sakshi
Sakshi News home page

ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు మరోసారి..

Published Sun, Jan 5 2020 3:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

క్రికెట్‌ చరిత్రలో రవిశాస్త్రి, యువరాజ్‌ సింగ్‌, హెర్ష్‌లీ గిబ్స్‌, రవీంద్ర జడేజా ఆరు సిక్సర్లు సాధించిన వీరులు. ఇప్పుడు వీరి సరసన మరో క్రికెటర్‌ చేరిపోయాడు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ లియో కార్టర్‌ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి అరుదైన జాబితాలో స్థానం సంపాదించాడు. న్యూజిలాండ్‌ సూపర్‌ స్మాష్‌ టీ20 లీగ్‌లో భాగంగా కాంటర్‌బరీ-నార్తరన్‌ నైట్స్‌ల మధ్య ఆదివారం మ్యాచ్‌ జరిగింది.ఈ మ్యాచ్‌లో కాంటర్‌బరీ బ్యాట్స్‌మన్‌ అయిన లీయో కార్టర్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement