క్రిస్ట్‌చర్చ్: ఇప్పటివరకూ టీ20 క్రికెట్‌లో యువరాజ్ సింగ్, రాస్ వైట్లీ, హజ్రుతుల్లా జజాయ్‌లు మాత్రమే ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు సాధించగా, గ్యారీ సోబర్స్, రవిశాస్త్రిలు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు సాధించారు. ఇక హెర్షలీ గిబ్స్ వన్డే ఫార్మాట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు వీరి సరసన న్యూజిలాండ్ క్రికెటర్ లియో కార్టర్ చేరిపోయాడు. ఫలితంగా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి ఆ ఫీట్ సాధించిన ఏడో క్రికెటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ సూపర్ స్మాష్ టీ20 లీగ్‌లో భాగంగా కాంటర్‌బరీ కింగ్ -నార్తరన్ నైట్స్‌ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో కాంటర్‌బరీ బ్యాట్స్‌మన్ అయిన లీయో కార్టర్ విశ్వరూపం ప్రదర్శించాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
కాగా, ఇన్నింగ్స్ 16 ఓవర్‌లో లియో కార్టర్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి జట్టు స్పిన్నర్ అంటోన్ డెవ్‌సిచ్ బౌలింగ్‌లో కార్టర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో తొలి సిక్స్‌ను బ్యాక్‌వర్డ్ స్వ్కేర్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టగా, రెండు, మూడు బంతుల్ని మిడ్ వికెట్ మీదుగా సిక్స్‌గా మలచాడు. ఇక నాల్గో బంతిని డీప్ స్వ్కేర్ లెగ్ వైపు సిక్స్ కొట్టగా, ఐదో బంతిని లాంగాన్ దిశగా సిక్స్‌గా కొట్టాడు. ఆరో బంతిని డీప్ స్క్వేర్ లెగ్‌లో మరో సిక్స్ కొట్టి రికార్డు నెలకొల్పాడు. ఫలితంగా నార్తరన్ నైట్స్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని కాంటర్‌బరీ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇప్పుడు లియో కార్టర్ కొట్టన సిక్సర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment