పాక్ ఆటగాళ్ల విజయానందం
దుబాయ్: టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ జట్టు చరిత్ర సృష్టించింది. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో వరుసగా 11 టీ20 సిరీస్‌లు గెలుచుకున్న జట్టుగా పాక్ రికార్డు సృష్టించింది. ఇటీవల ఆస్ట్రేలియాను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన పాక్.. తాజాగా న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. కొలిన్ మున్రో(44), విలియమ్సన్ (37), అండర్సన్ (44)లతో ఏడు వికెట్లు నష్టపోయి 153 పరుగుల చేసింది. ఈ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. బాబర్ అజమ్ (40), అసీఫ్ అలీ (38), మహ్మద్ హఫీజ్ (34)లు రాణించడంతో రెండు బంతులు మిగిలుండగా విజయాన్నందుకుంది. (చదవండి: టి20ల్లో ‘విన్’డీసే)
ఇక పాకిస్తాన్‌కు ఇది వరుసగా 8వ టీ20 విజయం కావడం విశేషం. అఫ్గానిస్తాన్ వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచి ఆ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్, ఐర్లాండ్, పాక్ వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి తరువాతి స్థానంలో నిలిచాయి. వరుసగా సిరీస్‌లు గెలిచిన జాబితాలో భారత్ 6టీ20 సిరీస్‌లను గెలిచి పాక్ తర్వాత నిలిచింది. (చదవండి: వారెవ్వా.. టీ20ల్లోనూ డబుల్ సెంచరీ!)
Comments
Please login to add a commentAdd a comment