
Dwayne Bravo Falls After Pollard Shot Hits Him Viral.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోకు తన రిటైర్మెంట్ రోజే చేదు అనుభవం ఎదురైంది. ఏమైందో అని కంగారుపడకండి.. తృటిలో గాయం నుంచి తప్పించుకున్నాడు. మిచెల్ మార్ష్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ ఐదో బంతిని వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి వేగంగా దూసుకురాడంతో బ్రావో కిందకు వంగాడు.. ఈ నేపథ్యంలో బ్యాట్ ఎగిరి క్రీజుపై పడింది. బ్రావో కొద్దిలో తప్పించుకున్నాడు.. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఒకవేళ బంతి తగిలి ఉంటే మాత్రం బ్రావోకు తన చివరి మ్యాచ్ చేదు అనుభవంగా మిగిలిపోయి ఉండేది.
చదవండి: Dwayne Bravo: అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రావో గుడ్ బై.. ఇక చాలు
2004లో డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 293 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 2006లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన బ్రావో.. ఇప్పటివరకు 90 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 1000 పరుగులు చేశాడు. 78 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.అదే విధంగా 2012, 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ముఖ్యంగా 2012 టోర్నీలో విన్నింగ్ క్యాచ్ అందుకుని జట్టును విజయతీరాలకు చేర్చిన తీరును ఎవరూ మర్చిపోలేరు.
చదవండి:Chris Gayle Retirement: సన్ గ్లాసెస్‌తో బరిలోకి.. క్రిస్ గేల్ రిటైర్మెంట్!
— Simran (@CowCorner9) November 6, 2021
Comments
Please login to add a commentAdd a comment