వన్డే సిరీస్‌లో టీమిండియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన వెస్టిండీస్ టీ20 సిరీస్‌ను కూడా పరాజయంతోనే ఆరంభించింది. మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో శుక్రవారం(ఫిబ్రవరి 18) నాటి రెండో టీ20 మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. కాగా బౌలింగ్‌లో చెప్పుకోదగ్గ వనరులు లేని విండీస్ కనీసం తమకు తెలిసిన విద్య దూకుడైన బ్యాటింగ్‌తోనైనా మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోక అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. నికోలస్ పూరన్ మాత్రమే గత మ్యాచ్‌లో బాగా ఆడగా, మిగతా వారంతా టి20 తరహా ప్రదర్శన చేయలేకపోయారు.
ముఖ్యంగా ఐపీఎల్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ‘హిట్టర్’ పొలార్డ్ ఒక్క ఇన్నింగ్స్‌లోనైనా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. కెప్టెన్ కూడా అయిన పొలార్డ్ గత మ్యాచ్‌లో మరీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇదిలా ఉంటే... వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. మరి విండీస్ ఓపెనర్లు బ్రండన్ కింగ్, మేయర్స్ శుభారంభం అందించడం సహా, పూరన్, పొలార్డ్ భారీ ఇన్నింగ్స్ ఆడితే తప్ప పర్యాటక జట్టు నుంచి చెప్పుకోదగ్గ స్కోరు ఆశించలేం.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్- రెండో టీ20:
ఎప్పుడు, ఎక్కడ.. తదితర వివరాలు
తేదీ: ఫిబ్రవరి 18, 2002
వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా .
సమయం: రాత్రి 7 గంటలకు ఆరంభం
స్టార్‌స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ముఖాముఖి రికార్డు:
మొత్తం 18 మ్యాచ్‌లు జరుగగా భారత్ 11, విండీస్ 6 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది.
తుది జట్ల అంచనా:
భారత్:
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్/శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్/ ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయి, యజువేంద్ర చహల్.
వెస్టిండీస్:
బ్రాండన్ కింగ్, కైల్ మేయెర్స్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జేసన్ హోల్డర్, ఫ్యాబియన్ అలెన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్/డొమినిక్ డ్రేక్స్.
చదవండి: Ishan Kishan-Rohit Sharma: ఇషాన్ కిషన్‌కు క్లాస్ పీకిన రోహిత్ శర్మ.. విషయమేంటి
Ranji Trophy 2022: సూపర్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన రహానే
.@surya_14kumar and Venkatesh Iyer take #TeamIndia home with a 6-wicket win in the 1st T20I.
— BCCI (@BCCI) February 16, 2022
Scorecard - https://t.co/dSGcIkX1sx #INDvWI @Paytm pic.twitter.com/jfrJo0fsR3
Comments
Please login to add a commentAdd a comment