Breadcrumb
Ind Vs Wi 2nd ODI: విండీస్‌తో టీమిండియా రెండో వన్డే... హైలైట్స్
Published Wed, Feb 9 2022 1:09 PM | Last Updated on Wed, Feb 9 2022 2:07 PM
Live Updates
ఇండియా వర్సెస్ వెస్టిండీస్: రెండో వన్డే హైలైట్స్
చెలరేగిన ప్రసిద్ధ్ కృష్ణ.. రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం
నయా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ(9-3-12-4) నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 238 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రసిద్ధ్‌కు తోడు టీమిండియా బౌలర్లు తలో చేయి వేయడంతో విండీస్ 193 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను రోహిత్ సేన 2-0 తేడాతో గెలుచుకుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసి, ప్రత్యర్ధి ముందు నామమాత్రపు టార్గెట్‌ను ఉంచింది. సూర్యకుమార్ యాదవ్(64), కేఎల్ రాహుల్(49) రాణించగా.. మిగతా భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, ఓడియన్ స్మిత్ చెరో 2 వికెట్లు, కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, ఫేబియన్ అలెన్‌లు తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో విండీస్ 193 పరుగులకే చాపచుట్టేయడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్(4/12), శార్ధూల్(2/21), సిరాజ్, చహల్, సుందర్, హుడా తలో వికెట్ పడగొట్టారు.
ఓటమి అంచుల్లో విండీస్.. ఎనిమిది వికెట్లు డౌన్
238 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 39.3 ఓవర్లలో 159 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. సిరాజ్, శార్ధూల్ వరుస ఓవర్లలో వికెట్లు తీసి విండీస్ ఓటమిని ఖరారు చేశారు. సిరాజ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఫేబియన్ అలెన్(13) ఔటవగా, అకీల్ హొసేన్(34) వికెట్ శార్ధూల్‌కు దక్కింది. క్రీజ్‌లో ఓడియన్ స్మిత్, అల్జరీ జోసఫ్ ఉన్నారు. విండీస్ గెలవాలంటే మరో 79 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
తొలి వన్డే వికెట్ పడగొట్టిన హుడా.. విండీస్ ఆరో వికెట్ డౌన్
టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా వన్డే కెరీర్లో తొలి వికెట్ పడగొట్టాడు. 31వ ఓవర్ ఆఖరి బంతికి విండీస్ బ్యాటర్ షమ్రా బ్రూక్స్ (44)ను హుడా బోల్తా కొట్టించాడు. సుర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో బ్రూక్స్ వెనుదిరిగాడు. ఫలితంగా విండీస్ ఆరో వికెట్ కోల్పోయి ఓటమి బాట పట్టింది. 31 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 120/6. క్రీజ్‌లో అకీల్ హొసేన్(10), ఫేబియన్ అలెన్ ఉన్నారు.
76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన విండీస్
238 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు తడబడుతుంది. 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. భారత బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ(3), చహల్(1), శార్ధూల్ ఠాకూర్(1) విండీస్ వెన్ను విరిచారు. 22వ ఓవర్ ఆఖరి బంతికి శార్ధూల్.. కీలక ఆటగాడు హోల్డర్(2)ను బోల్తా కొట్టించడంతో విండీస్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. తదుపరి బ్యాటింగ్ లైనప్‌లో చెప్పుకోదగ్గ బ్యాటర్లు లేకపోవడంతో విండీస్ ఓటమి ఖాయంగా తెలుస్తోంది. క్రీజ్‌లో బ్రూక్స్(15), అకీల్ హొసేన్ ఉన్నారు.
విండీస్‌కు మరో షాకిచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ
టీమిండియా నయా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ విండీస్ బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వరుసగా వికెట్లు తీస్తూ పర్యాటక జట్టును కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు. తొలి స్పెల్‌లో వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టిన అతను.. 20వ ఓవర్లో విండీస్‌కు మరో ఝలక్ ఇచ్చాడు. ప్రమాదకర ఆటగాడు నికోలస్ పూరన్(9)ను ఔట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా విండీస్ జట్టు 20 ఓవర్లలో 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. క్రీజ్‌లో బ్రూక్స్(7), హోల్డర్ ఉన్నారు.
తిప్పేస్తున్న చహల్.. విండీస్ మూడో వికెట్ డౌన్
238 పరుగుల నామమాత్రపు లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు తడబడుతుంది. టీమిండియా బౌలర్లు కచ్చితమైన లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ.. ప్రత్యర్ధిని కట్టడి చేస్తున్నారు. తొలుత ప్రసిద్ధ్ కృష్ణ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి విండీస్‌ను కష్టాల్లోకి నెట్టగా.. 17వ ఓవర్ రెండో బంతికి చహల్ షాయ్ హోప్(27)ను పెవిలియన్‌కు పంపి పర్యాటక జట్టుపై మరింత ఒత్తిడి పెంచాడు. 17 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 61/3. క్రీజ్‌లో షమ్రా బ్రూక్స్(4) నికోలస్ పూరన్(7) ఉన్నారు.
ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ బౌలింగ్.. విండీస్ రెండో వికెట్ డౌన్
టీమిండియా నయా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. వరుసగా రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసి పర్యాటక జట్టును దెబ్బకొట్టాడు. తొలుత బ్రాండన్ కింగ్(18)ను పెవిలియన్‌కు పంపిన అతను.. తన స్పెల్ మరుసటి ఓవర్లో డారెన్ బ్రావో(1)ను ఔట్ చేశాడు. ఫలితంగా విండీస్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 10 ఓవర్ల తర్వాత విండీస్ 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజ్‌లో షాయ్ హోప్(16), షమ్రా బ్రూక్స్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్
238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో 18 పరుగులు చేసి బ్రాండన్ కింగ్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం వెస్టిండీస్ స్కోరు 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 38గా ఉంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్ 49 పరుగులు చేశాడు. దీపక్హుడా 29 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
పెవిలియన్‌కు క్యూ కట్టిన టీమిండియా ఆటగాళ్లు
టీమిండియా టెయిలెండర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. 46వ ఓవర్లో శార్ధూల్ ఠాకూర్, 48వ ఓవర్లో సిరాజ్ ఔటయ్యారు. సిరాజ్ 3 పరుగులు చేసి అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 48 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 226/8. క్రీజ్‌లో దీపక్ హూడా(29), చహల్(1) ఉన్నారు.
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
46వ ఓవర్ ఆఖరి బంతికి టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో బ్రూక్స్‌కు క్యాచ్ ఇచ్చి శార్ధూల్ ఠాకూర్(8) ఔటయ్యాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 212/7గా ఉంది. క్రీజ్‌లో దీపక్ హూడా(20), సిరాజ్ ఉన్నారు.
టీమిండియాకు బిగ్ షాక్.. సూర్యకుమార్ ఔట్
ప్రత్యర్ధికి ఫైటింగ్ టార్గెట్ నిర్ధేశించాలని భావించిన టీమిండియాకు 39వ ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్రీజ్‌లో నిలదొక్కుకున్న సూర్యకుమార్ యాదవ్ 64 పరుగులు చేసి ఫేబియన్ అలెన్ బౌలింగ్‌లో అల్జరీ జోసఫ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 40 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 183/5. క్రీజ్‌లో సుందర్(21), దీపక్ హూడా(3) ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్(49) ఔట్
నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్(48 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఫలితంగా టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 30 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 139/4. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్(59 బంతుల్లో 40; 3 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్(2 బంతుల్లో 5; ఫోర్) ఉన్నారు.
కేఎల్ రాహుల్, సూర్యకుమార్ నిలకడ.. టీమిండియా 116/3
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్(40 బ్యాటింగ్), సూర్యకుమార్ యాదవ్(32 బ్యాటింగ్) నిలకడైన ఆటతో టీమిండియా కాస్త కోలుకుంది. ప్రస్తుతం టీమిండియా 28 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. సూర్య, రాహుల్ మధ్య ఇప్పటివరకు 79 పరుగుల భాగస్వామ్యం నమోదైంది
18 ఓవర్లలో టీమిండియా 63/3
18 ఓవర్ల ఆట ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 15, కేఎల్ రాహుల్ 4 పరుగులతో ఆడుతున్నారు.
బిగ్ వికెట్ కోల్పోయిన టీమిండియా
టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తాజాగా సీనియర్ ఆటగాడు కోహ్లి 18 పరుగులు చేసి స్మిత్ బౌలింగ్‌లో షైయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి స్మిత్ టీమిండయాను దెబ్బ తీశాడు. ప్రస్తుతం భారత్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.
పంత్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
రిషబ్ పంత్(18) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఓడెన్ స్మిత్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన పంత్ హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్‌గా ప్రమోషన్ పొందినప్పటికి పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం టీమిండియా 11 ఓవర్లలో 39 పరుగులు చేసింది.
క్రీజులో పంత్, కోహ్లి
రిషభ్ పంత్ 12, కోహ్లి 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు: 32/1 (8.4).
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
విండీస్ ఆటగాడు రోచ్ బౌలింగ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. షాయీ హోప్‌నకు క్యాచ్ ఇచ్చి 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. కాగా కోహ్లికి ఇది వందో వన్డే కావడం గమనార్హం.
స్కోరు: 17/1 (5.4)
రోహిత్‌కు జోడీగా రిషభ్ పంత్
విండీస్ ఆహ్వానం మేరకు టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ రోహిత్ శర్మకు జోడీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ బరిలోకి దిగడం విశేషం.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్: తుది జట్లు ఇవే
టీమిండియాతో రెండో వన్డేలో విండీస్‌ను నికోలస్ పూరన్ ముందుండి నడిపించనున్నాడు. కీరన్ పొలార్డ్ ఫిట్‌గా లేకపోవడంతో అతడు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. టాస్ గెలిచిన పూరన్ ముందుగా ఫీల్డింగ్ చేయనున్నట్లు పేర్కొన్నాడు.
తుది జట్లు ఇవే:
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్‌సిరాజ్, యజువేంద్ర చాహల్, ప్రసిద్ కృష్ణ
వెస్టిండీస్: షాయీ హోప్, బ్రాండన్ కింగ్, డారెన్బ్రావో, షామా బ్రూక్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), జేసన్ హోల్డర్, ఒడెన్ స్మిత్, అకీల్ హొసేన్, ఫాబియన్ అలెన్, అల్జారీ జోసెఫ్, కేమార్ రోచ్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
టీమిండియా- వెస్టిండీస్ మధ్య మరికొద్ది సేపట్లో రెండో వన్డే ఆరంభం కానుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
🚨 Toss Update 🚨
— BCCI (@BCCI) February 9, 2022
West Indies have elected to bowl against #TeamIndia in the second ODI of the series. #INDvWI | @Paytm
Follow the match ▶️ https://t.co/yqSjTw302p pic.twitter.com/fcnbt584s9
Related News By Category
Related News By Tags
-
Ind Vs Wi: అదే ఆఖరు... 19 ఏళ్లకు పైగానే అయింది గెలిచి.. ఈసారి కూడా!
Ind Vs Wi ODI Series 2022- చారిత్రాత్మక 1000వ వన్డేలో వెస్టిండీస్‌పై అద్భుత విజయం అందుకున్న టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు భారత్‌లో మరోవన్డే సి...
-
రోహిత్ శర్మ కళ్లు చెదిరే సిక్స్.. ఆ చూపుకు అర్థమేంటి ?
టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఓటమి పాలయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 28 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా కెప్టెన్.. ఓపెనర్ రోహిత్ శర...
-
రోహిత్, విరాట్లకు రెండు వారాల సెలవు! ఆగష్టు 23 నుంచి అక్కడే!
Rohit Sharma & Virat Kohli: టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రెండు వారాల పాటు సెలవుల్లో గడుపనున్నారు. ఆటకు విరామమిచ్చి విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకు...
-
ఓడిపోతే ఏం జరిగేదో తెలుసు! అందుకే రోహిత్, కోహ్లిలను కాదని ఇలా: హార్దిక్
West Indies vs India, 3rd ODI- Hardik Panyda Comments: ‘‘ఈ గెలుపు మాకెంతో ప్రత్యేకం. కెప్టెన్‌గా నాకు గుర్తిండిపోయే విజయం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే.. ఏం జరిగేదో మాకు తెలుసు. పూర్తిగా నిరాశలో కూర...
-
కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! మ్యాచ్ ఓడిపోతేనే! ఆసియా కప్ తర్వాత ఇద్దరూ అవుట్?
Virat Kohli- Rohit Sharma Rested For Ind vs WI 2nd ODI: వెస్టిండీస్ పర్యటనకు ముందు.. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి...
Comments
Please login to add a commentAdd a comment