స్వదేశంలో వెస్టిండీస్‌తో తొలి పోరుకు టీమిండియా సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా భారత్-విండీస్ మధ్య తొలి వన్డే ఆదివారం జరగనుంది. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్, కరోనాతో ధావన్, శ్రేయస్, రుతురాజ్, సైనీలు దూరమయ్యారు. మరో వైపు విండీస్ జట్టుకు గాయంతో హెట్‌మైర్, కోవిడ్‌తో ఎవిన్ లూయిస్ దూరమయ్యారు. వీరి స్ధానంలో ఒడియన్ స్మిత్, రొమరియో షెఫర్డ్ జట్టులోకి వచ్చారు.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, పంత్, సూర్యకుమార్, దీపక్ హుడా/వాషింగ్టన్ సుందర్, చహర్, శార్దుల్, కుల్దీప్, చహల్, ప్రసిధ్ కృష్ణ.
వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), హోప్, బ్రాండన్ కింగ్/బానెర్, పూరన్, బ్రూక్స్, డారెన్ బ్రేవో, స్మిత్/షెఫర్డ్, హోల్డర్, హొసెయిన్, రోచ్, హెడెన్ వాల్ష్ జూనియర్.
పిచ్–వాతావరణం
పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. భారీ స్కోర్లు ఖాయం. మంచు వల్ల బౌలర్లకు సవాళ్లు తప్పవు. వర్షం ముప్పులేదు.
చదవండి: Under-19 World Cup Final: అరుదైన రికార్డు సాధించిన రాజ్ బావా.. కపిల్ దేవ్ తర్వాత!
Comments
Please login to add a commentAdd a comment