Ind Vs Wi T20 Series 2022- కోల్‌కతా: వన్డే సిరీస్ సంపూర్ణ విజయంతో ఆతిథ్య భారత జట్టు టి20 సిరీస్‌పైనా కన్నేసింది. మెరిపించి మురిపించేందుకు బ్యాటర్స్ సిద్ధంగా ఉన్నారు. సత్తా చాటేందుకు సీమర్లు తహతహలాడుతున్నారు. ఇక శుభారంభమే తరువాయి అన్నట్లుగా టీమిండియాలో ఆత్మవిశ్వాసం తొణకిసలాడుతోంది. మరోవైపు వన్డేలన్నీ ఓడిన వెస్టిండీస్ జట్టు మళ్లీ ఓడేందుకు సిద్ధంగా లేదు. పైగా ఫార్మాట్ మారింది. తమ ఆటగాళ్ల గేరు కూడా మారబోతుందని మ్యాచ్ ద్వారా చాటాలని కరీబియన్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే తొలి టి20 ఆసక్తికరంగా జరిగే అవకాశముంది.
ఇషాన్‌తోనే ఓపెనింగ్
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ ఇప్పుడు పూర్తిస్థాయి కెప్టెన్‌గా టీమిండియాకు అంతర్జాతీయ ట్రోఫీ అందించేందుకు తొలి అడుగు వేయబోతున్నాడు. తన ఫ్రాంచైజీ సహచరుడు పొలార్డ్ ఇప్పుడు ప్రత్యర్థి కెప్టెన్. ఈ నేపథ్యంలో పొట్టి సిరీస్‌లో ఎవరి వ్యూహాప్రతివ్యూహాలు పైచేయి సాధిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
తుది జట్టు కసరత్తు విషయానికొస్తే రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో దూరం కావడంతో రోహిత్ తన ఓపెనింగ్ భాగస్వామిగా ఇషాన్ కిషన్‌నే బరిలోకి దింపుతాడు. సూర్యకుమార్‌ను కొనసాగించాలనుకుంటున్న కెప్టెన్ ఆల్‌రౌండర్లలో శార్దుల్, దీపక్ చహర్, హర్షల్ పటేల్‌లలో ఒకరినే తీసుకోవచ్చు. పేసర్లలో వన్నే తగ్గిన భువనేశ్వర్‌ను కాదని సిరాజ్‌కు జతగా అవేశ్ ఖాన్‌ను బరిలోకి దించడం దాదాపు ఖాయమైంది.
చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్
Bull's-eye Bhuvi 🎯
— BCCI (@BCCI) February 15, 2022
Sharp Siraj ⚡
A snippet of how the #TeamIndia speedsters sweated it out in the practice session under the watchful eyes of the Bowling Coach Paras Mhambrey at the Eden Gardens. 👌 👌#INDvWI | @Paytm | @BhuviOfficial | @mdsirajofficial pic.twitter.com/hMhCdAY9VJ
Comments
Please login to add a commentAdd a comment