![Sachin Tendulkar Pays Tribute To Kieron Pollard Father Passed Away - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/24/pollard.jpg.webp?itok=l9it1ZdN)
ముంబై: వెస్టిండీస్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. అతడి తండ్రి మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పొలార్డ్ నేడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘టాల్ బాయ్ ఇకలేరు. ప్రశాంతంగా విశ్రమించండి.. ఎల్లప్పుడూ మిమ్మల్ని నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఎన్నో హృదయాలను మీరు గెలుచుకున్నారు. ఇక ముందు కూడా మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను. మీరు ఎక్కడో ఒకచోట విశ్రాంతి తీసుకుంటున్నారని నాకు తెలుసు’’ అని పొలార్డ్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ ట్రోఫీతో తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు
ఇక ఈ విషయంపై స్పందించిన టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పొలార్డ్‌కు సానుభూతి ప్రకటించాడు. ‘‘మీ నాన్న గారు మరణించారన్న విషయం ఇప్పుడే తెలిసింది. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ఆ దేవుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలి’’అని ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశాడు. కాగా కీరన్ పొలార్డ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్-14 వ సీజన్ ఏప్రిల్ 9 నుంచి ఆరంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలిపోరు జరుగనుంది.
చదవండి: ముగ్గురు కెప్టెన్లకు గాయాలు.. ఆందోళనలో ఫ్రాంచైజీలు
కృనాల్- టామ్ కరన్ గొడవ; కోహ్లి రియాక్షన్ చూశారా?!
Comments
Please login to add a commentAdd a comment