Ireland Beat West Indies : ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. వెస్టిండీస్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి సిరీస్ గెలుపు ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాగా మూడు వన్డేలు ఆడే నిమిత్తం ఐర్లాండ్.. వెస్టిండీస్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి వన్డేలో ఆతిథ్య విండీస్ 24 పరుగుల తేడాతో గెలుపొందగా.. పర్యాటక జట్టులో కోవిడ్ కేసుల కారణంగా రెండో వన్డే వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో జనవరి 11న జరగాల్సిన మ్యాచ్‌ను 13వ తేదీన నిర్వహించారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పొలార్డ్ బృందం 229 పరుగులకు ఆలౌట్ కాగా... వర్షం కారణంగా డక్‌వర్త్ లూయీస్ నిబంధన ప్రకారం మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు. ఇందులో భాగంగా 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్... 32.3 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విండీస్‌పై విజయం సాధించింది.
ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆండీ మెక్‌బ్రైన్(4 వికెట్లు... 45 బంతుల్లో 35 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. హ్యారీ హెక్టార్ 54 పరుగుల(నాటౌట్)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ వన్డే కెరీర్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఐరిష్ క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఈ విజయం గురించి స్పందించిన పాల్.. విండీస్‌పై గెలుపు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు.
స్కోర్లు:
వెస్టిండీస్- 229 (48)
ఐర్లాండ్- 168/5 (32.3)
The 2nd wicket to fall in the innings. A good grab by the skipper! #WIvIRE pic.twitter.com/bJFUOo0Hd2
— Windies Cricket (@windiescricket) January 13, 2022
Comments
Please login to add a commentAdd a comment