నయా చాలెంజ్‌.. కొత్త లుక్‌లో పొలార్డ్‌ | Kieron Pollard Takes Inspiration From Hardik Pandya | Sakshi

నయా చాలెంజ్‌.. కొత్త లుక్‌లో పొలార్డ్‌

Oct 6 2020 8:14 PM | Updated on Oct 6 2020 8:18 PM

Kieron Pollard Takes Inspiration From Hardik Pandya - Sakshi

అబుదాబి: ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ కీరోన్‌ పొలార్డ్‌ నయా లుక్‌లో కనిపిస్తున్నాడు. తన మొత్తం గడ్డాన్ని తీసేసి కేవలం ఫ్రెంచ్‌ కట్‌లో కనిపిస్తూ ముంబై ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన సహచర  ఆటగాడు హార్దిక్‌ పాండ్యా విసిరిన  ‘బ్రేక్‌ ద బియార్డ్‌’  చాలెంజ్‌లో భాగంగా కొత్త పోలీ కనిపిస్తున్నాడని పొలార్డ్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు ఒక వీడియోను పొలార్డ్‌ షేర్‌ చేశాడు. తొలుత  గడ్డాన్ని చూపించిన పొలార్డ్‌.. ఆపై ఫ్రెంచ్‌ కట్‌లో కనిపించాడు. ఈ చాలెంజ్‌కు కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ను నామినేట్‌ చేశాడు పొలార్డ్‌. (చదవండి: రాబిన్‌ ఊతప్ప ఔట్‌)

‘ఇది కొత్త సీజన్‌.. కొత్త పోలీ(పొలార్డ్‌).  ఈ చాలెంజ్‌ను నా బ్రదర్‌ హర్దిక్‌ పాండ్యాను స్వీకరించా. గేమ్‌ ఆన్‌’ అని పేర్కొన్న పొలార్డ్‌.. కార్తీక్‌ను ట్యాగ్‌ చేశాడు. ఈ సవాల్‌ను దినేశ్‌ కార్తీక్‌ స్వీకరించాడు. అక్టోబర్‌ 16వ తేదీని కేకేఆర్‌-ముంబై ఇండియన్స్‌ ల మధ్య మ్యాచ్‌ జరుగనున్న క్రమంలో ఈ చాలెంజ్‌ను దినేశ్‌ కార్తీక్‌ విసిరాడు పొలార్డ్‌. ఈ సీజన్‌లో పొలార్డ్‌(25 నాటౌట్‌, 47 నాటౌట్‌, 60 నాటౌట్‌, 13 నాటౌట్‌, 18)జట్టుకు విలువైన పరుగులు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్‌ 13 బంతుల్లో 3 సిక్స్‌లతో అజేయంగా 25 పరుగులు చేసి స్కోరు బోర్డును రెండొందలు దాటించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement