కిరాన్‌ పొలార్డ్‌ విధ్వంసం.. వరుసగా 5 సిక్స్‌లు! వీడియో వైరల్‌ | Kieron Pollard smacks five consecutive sixes off Rashid Khan | Sakshi
Sakshi News home page

కిరాన్‌ పొలార్డ్‌ విధ్వంసం.. వరుసగా 5 సిక్స్‌లు! వీడియో వైరల్‌

Published Sun, Aug 11 2024 7:58 AM | Last Updated on Sun, Aug 11 2024 11:22 AM

Kieron Pollard smacks five consecutive sixes off Rashid Khan

ది హండ్రెడ్ లీగ్‌-2024లో శ‌నివారం సౌతాంప్ట‌న్ వేదిక‌గా ట్రెంట్ రాకెట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో  సదరన్ బ్రేవ్ జ‌ట్టు విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ ఆల్-రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు.

127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సదరన్ బ్రేవ్ 68 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన పొలార్డ్ తొలుత కాస్త ఆచితూచి ఆడాడు. బౌల‌ర్ల‌ను ఎదుర్కొవ‌డానికి కాస్త ఇబ్బంది ప‌డ్డాడు.

ఒక‌నొక ద‌శ‌లో 14 బంతులు ఎదుర్కొన్న ఈ క‌రేబియ‌న్ ఆల్‌రౌండ‌ర్‌ కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే చేసి అభిమానుల‌కు విసుగు తెప్పించాడు. ఆఖ‌రి 20 బంతుల్లో  స‌ద‌ర‌న్ బ్రేవ్ విజ‌యానికి 49 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో అప్ప‌టివ‌రకు జిడ్డు బ్యాటింగ్ చేసిన పొలార్డ్ పూన‌కం వ‌చ్చిన‌ట్లు చెల‌రేగిపోయాడు. 

ట్రెంట్ రాకెట్స్ స్పిన్న‌ర్‌ రషీద్ ఖాన్‌ను పొలార్డ్ ఊచ‌కోత కోశాడు. 16వ సెట్ బౌలింగ్ చేసిన ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో పొలార్డ్ వ‌రుస‌గా 5 సిక్స్‌లు బాది మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్‌.. 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు. 127 పరుగుల లక్ష్యాన్ని 99 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి చేధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement