Wi Squad For India 2022 T20: ఫిబ్రవరిలో టీమిండియా టూర్ రానున్న వెస్టిండీస్ జట్టు టి20 సిరీస్‌కు 16 మందితో కూడిన జట్టును శనివారం ప్రకటించింది. కీరన్ పొలార్డ్ కెప్టెన్ కాగా.. నికోలస్ పూరన్ వైస్ కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడుతున్న విండీస్.. 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌తో ఆడుతున్న జట్టునే భారత్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు ఎంపిక చేశారు.
అయితే విండీస్ క్రికెట్ బోర్డు ఇదివరకే వన్డే జట్టును ప్రకటించింది. షామ్రా బ్రూక్స్, క్రుమ్హా బోనర్, కీమర్ రోచ్‌లను వన్డేలకే పరిమితం చేశారు. ఇక టి20 ప్రపంచకప్‌లో పొలార్డ్ కెప్టెన్సీలో విండీస్ జట్టు అంతగా రాణించకపోవడంతో సూపర్-12 దశలోనే వెనుదిరిగింది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్‌లో విండీస్ జట్టు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడి సూపర్-12 దశకు అర్హత సాధించాల్సి ఉంటుంది.
వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్‌కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షై హోప్, అకియెల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్, ఓడియన్ స్మిత్ షెపర్డ్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్
Comments
Please login to add a commentAdd a comment