
PC: IPL.com
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై విధ్వంసకర ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వెళ్తుండగా.. సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అతడి కాళ్లకు దండం పెట్టాడు. అదే విధంగా అనంతరం వీరిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీరిద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అదే విధంగా వీరిద్దరూ చాలా ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే పొలార్డ్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరనీ షాక్‌కు గురి చేశాడు. పొలార్డ్ విండీస్ తరపున 123 వన్డేలు, 101 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.
— Diving Slip (@SlipDiving) April 21, 2022