టి20 ఫార్మాట్‌లో తొలి క్రికెటర్‌గా.. | Kieron Pollard Becomes First Cricketer To Play 500 T20s | Sakshi
Sakshi News home page

టి20 ఫార్మాట్‌లో తొలి క్రికెటర్‌గా..

Published Thu, Mar 5 2020 10:01 AM | Last Updated on Thu, Mar 5 2020 10:02 AM

Kieron Pollard Becomes First Cricketer To Play 500 T20s - Sakshi

పల్లెకెలె: వెస్టిండీస్‌ విధ్వంసక ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ అరుదైన మైలురాయిని దాటాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌ అతని టి20 కెరీర్‌లో 500వది కావడం విశేషం. టి20 ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా అతను నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసిన పొలార్డ్‌... సరిగ్గా అదే స్కోరు వద్ద టి20ల్లో 10 వేల పరుగులు కూడా పూర్తి చేసుకోవడం విశేషం. ఉదాన బౌలింగ్‌లో సిక్సర్‌తో ఈ రికార్డు చేరుకున్న అతను... క్రిస్‌ గేల్‌ (13,296) తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 500 టి20 మ్యాచ్‌లలో 150.57 స్ట్రయిక్‌ రేట్‌తో 10,000 పరుగులు చేసిన పొలార్డ్‌... 280 వికెట్లు కూడా పడగొట్టాడు. 1 సెంచరీ, 49 అర్ధసెంచరీలు చేశాడు.


పొలార్డ్‌ టి20 కెరీర్‌ విశేషాలు కొన్ని:  
23- ఆడిన టి20 టోర్నీ ఫైనల్స్‌ సంఖ్య 

17 -వెస్టిండీస్‌ సహా ఆడిన జట్ల సంఖ్య

13- విజయంలో భాగమైన టైటిల్స్‌ సంఖ్య (6 వేర్వేరు జట్ల తరఫున) 

170- అత్యధికంగా ముంబై ఇండియన్స్‌కు ఆడిన మ్యాచ్‌లు 

6-ముంబై తరఫు టైటిల్స్‌ (4 ఐపీఎల్, 2 చాంపియన్స్‌ లీగ్‌)

2012 టి20 ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు  

వెస్టిండీస్‌ విజయం
శ్రీలంకతో జరిగిన తొలి టి20లో విండీస్‌ 25 పరుగులతో గెలిచింది. సిమన్స్‌ (51 బంతుల్లో 67 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సహాయంతో తొలుత విండీస్‌ 4 వికెట్లకు 196 పరుగులు చేయగా... అనంతరం లంక 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కుశాల్‌ పెరీరా (38 బంతుల్లో 66; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ఒషాన్‌ థామస్‌ (5/28) పవర్‌ప్లేలోనే ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement