ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ దనుష గుణతిలక అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా వెనుదిరిగాడు.నిబంధనల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ బంతిని కావాలని అడ్డుకుంటేనే దానిని అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా పరిగణిస్తారు. శ్రీలంక ఇన్నింగ్ష్ 22వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కీరన్ పొలార్డ్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని నిసాంకా ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అతడిని వారిస్తూ ముందుకొచ్చిన గుణతిలక... వెనక్కి వెళ్లే ప్రయత్నంలో బంతిపై కాలు పెట్టాడు. అయితే పొలార్డ్ సహా ఇతర విండీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్లు గుణతిలకను అవుట్‌గా ప్రకటించారు. అయితే వీడియోలో మాత్రం గుణతిలక అసలు బంతి ఎక్కడ ఉందో చూడకుండా వెనక్కి జరగడాన్ని బట్టి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని అర్థమవుతోంది.
దీనిపై పొలార్డ్ సైతం క్షమాపణలు తెలియజేశాడని గుణతిలకా పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పొలార్డ్ తన వద్దకు వచ్చి క్షమాపణలు కోరినట్టు స్పష్టం చేశాడు. ‘ నేను బంతిని కాలితో తొక్కి అడ్డుకోవడం కావాలని చేసింది కాదని పొలార్డ్ రిప్లేలో చూసి తెలుసుకున్నాడు. దాంతో మ్యాచ్ ముగిసిన తర్వాత నా వద్దకు క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన ఫోటోను వెస్టిండీస్ క్రికెట్ ట్వీటర్‌లో షేర్ చేసింది. గుణతిలకాతో పొలార్డ్ చాట్ చేశాడు. ఇది స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అని పేర్కొంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక 232 పరుగులు చేస్తే, విండీస్ రెండు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది.
Danushka Gunathilaka has been given out Obstructing the field. Very difficult to interpret if this was a wilful obstruction. Looks unintentional but has been given out as per the lawspic.twitter.com/CJh3GmzvaN
— Sarang Bhalerao (@bhaleraosarang) March 10, 2021
@KieronPollard55 and @danushka_70 had a chat at close of play. 🙏🏾#SpiritOfCricket #WIvSL 🏏🌴 pic.twitter.com/FowckA7ajx
— Windies Cricket (@windiescricket) March 10, 2021
Comments
Please login to add a commentAdd a comment