Gunatilaka
-
పొలార్డ్ క్షమాపణలు చెప్పాడు..
ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక ఓపెనర్ దనుష గుణతిలక అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా వెనుదిరిగాడు.నిబంధనల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ బంతిని కావాలని అడ్డుకుంటేనే దానిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా పరిగణిస్తారు. శ్రీలంక ఇన్నింగ్ష్ 22వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కీరన్ పొలార్డ్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని నిసాంకా ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అతడిని వారిస్తూ ముందుకొచ్చిన గుణతిలక... వెనక్కి వెళ్లే ప్రయత్నంలో బంతిపై కాలు పెట్టాడు. అయితే పొలార్డ్ సహా ఇతర విండీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్లు గుణతిలకను అవుట్‌గా ప్రకటించారు. అయితే వీడియోలో మాత్రం గుణతిలక అసలు బంతి ఎక్కడ ఉందో చూడకుండా వెనక్కి జరగడాన్ని బట్టి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని అర్థమవుతోంది. దీనిపై పొలార్డ్ సైతం క్షమాపణలు తెలియజేశాడని గుణతిలకా పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పొలార్డ్ తన వద్దకు వచ్చి క్షమాపణలు కోరినట్టు స్పష్టం చేశాడు. ‘ నేను బంతిని కాలితో తొక్కి అడ్డుకోవడం కావాలని చేసింది కాదని పొలార్డ్ రిప్లేలో చూసి తెలుసుకున్నాడు. దాంతో మ్యాచ్ ముగిసిన తర్వాత నా వద్దకు క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన ఫోటోను వెస్టిండీస్ క్రికెట్ ట్వీటర్లో షేర్ చేసింది. గుణతిలకాతో పొలార్డ్ చాట్ చేశాడు. ఇది స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అని పేర్కొంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక 232 పరుగులు చేస్తే, విండీస్ రెండు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది. Danushka Gunathilaka has been given out Obstructing the field. Very difficult to interpret if this was a wilful obstruction. Looks unintentional but has been given out as per the lawspic.twitter.com/CJh3GmzvaN — Sarang Bhalerao (@bhaleraosarang) March 10, 2021 @KieronPollard55 and @danushka_70 had a chat at close of play. 🙏🏾#SpiritOfCricket #WIvSL 🏏🌴 pic.twitter.com/FowckA7ajx — Windies Cricket (@windiescricket) March 10, 2021 -
ఒక ఆటగాడు అలా ఔటవ్వడం ఇది ఏడోసారి
నార్త్‌సౌండ్: వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఓపెనర్ గుణతిలక అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా వెనుదిరిగాడు.నిబంధనల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ బంతిని కావాలని అడ్డుకుంటేనే దానిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా పరిగణిస్తారు. శ్రీలంక ఇన్నింగ్ష్ 22వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కీరన్ పొలార్డ్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని నిసాంకా ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అతడిని వారిస్తూ ముందుకొచ్చిన గుణతిలక... వెనక్కి వెళ్లే ప్రయత్నంలో బంతిపై కాలు పెట్టాడు. అయితే పొలార్డ్ సహా ఇతర విండీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్లు గుణతిలకను అవుట్‌గా ప్రకటించారు. అయితే వీడియోలో మాత్రం గుణతిలక అసలు బంతి ఎక్కడ ఉందో చూడకుండా వెనక్కి జరగడాన్ని బట్టి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని అర్థమవుతోంది.అయితే ఒక ఆటగాడు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వన్డేల్లో ఔటవ్వడం ఇది ఏడోసారి. ఇంతకముందు వన్డేల్లో 6 సార్లు, టెస్టుల్లో ఒకసారి.. టీ20ల్లో ఒకసారి బ్యాట్స్‌మన్ ఈ పద్దతిలో ఔటయ్యాడు.అతను కావాలని అలా చేశాడో.. లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ నిబంధనల ప్రకారం గుణతిలకను అవుట్‌గా ప్రకటించారని మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ పొలార్డ్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. గుణతిలక (55), కరుణరత్నే (52), ఆషెన్ బండార (50) అర్ధ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, జాసన్ మొహమ్మద్ 2, పొలార్డ్ , పాబియెన్ అలెన్, జోసెఫ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 47ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. షై హోప్ 110 పరుగులతో ఆకట్టుకోగా.. ఎవిన్ లూయిస్ 65 అతనికి సహకరించాడు. ఈ విజయంతో విండీస్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 12న జరగనుంది. చదవండి: 'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు' Danushka Gunathilaka has been given out Obstructing the field. Very difficult to interpret if this was a wilful obstruction. Looks unintentional but has been given out as per the lawspic.twitter.com/CJh3GmzvaN — Sarang Bhalerao (@bhaleraosarang) March 10, 2021 -
ప్రాక్టీస్ సెషన్‌కు రాలేదని క్రికెటర్‌పై నిషేదం..
కొలంబో : నిబంధనలు ఉల్లంఘించినందుకు శ్రీలంక యువ క్రికెటర్ ధనుష్క గుణతిలకపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. ప్రాక్టీస్ సెషన్‌ను ఎగ్గొటడమే కాకుండా, బోర్డు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు 6 అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేదంతో పాటు అతని కాంట్రాక్టులో 20 శాతం కోత విధించింది. మైదానం బయట గుణతిలక ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని సస్పెండ్ చేసినట్లు లంక బోర్డు అధికారులు తెలిపారు. ఈ నిషేదం సెప్టెంబర్ 30 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇటీవల భారత్‌తో టెస్టు, వన్డే సిరీస్ సమయంలో ఓ మ్యాచ్ ఆడేందుకు మైదానానికి వస్తూ తన బ్యాటింగ్ కిట్‌ను తీసుకురాకుండా వచ్చాడు. ఇవన్నీ గుర్తించిన బోర్డు తాజాగా 6 మ్యాచుల నిషేధాన్ని విధిస్తూ చర్యలు తీసుకుంది. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనే గుణతిలక టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అనంతరం ఐదు వన్డేలకు ఎంపికైన గుణతిలక రెండు వన్డేల తర్వా గాయంతో దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు దుబాయ్‌లో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించగా రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సస్పెన్షన్‌తో టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో గుణతిలకకు చోటు దక్కలేదు. -
పాండ్యా అరంగేట్రం.. అశ్విన్ @50
గాలె: మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక తొలి టెస్టుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్ భారత్ స్పిన్నర్ అశ్విన్‌కు 50 వ టెస్టు అయితే ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. 289 టెస్టు ఆటగాడిగా పాండ్యా కోహ్లీ చేతులు మీద క్యాప్ అందుకున్నాడు. ఇప్పటి వరకు 17 వన్డేలు 19 టీ-20లు ఆడిన పాండ్యా కెరీర్లో తొలి టెస్టు శ్రీలంకపై ఆడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాండ్యా అదరగొడుతాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. అశ్విన్ కెరీర్లో మైలురాయి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ టెస్టు ద్వారా తన కెరీర్లో ఓ మైలురాయిని అందుకున్నాడు. అశ్విన్ ఇప్పటి వరకు 49 టెస్టుల్లో 275 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఈ మ్యాచ్‌తో లంక జట్టు ఆటగాడు దనుష్క గుణతిలక టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. భారత్‌పై తన తొలి టెస్టు ఆడుతోన్నాడు. Proud moment for young @hardikpandya7 as he is all set to make his Test debut #TeamIndia #SLvIND pic.twitter.com/YTGTzQ0Z4y — BCCI (@BCCI) 26 July 2017 -
టాస్ నెగ్గిన కోహ్లీ సేన..
గాలే: శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ సేన టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. జ్వరం కారణంగా కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కాగా అతని స్థానంలో శిఖర్ ధావన్‌ను తీసుకున్నారు. హార్ధిక్ పాండ్యా కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్నాడు. ఇద్దరు పేసర్లు, ఇద్దరి స్పిన్నర్లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండంతో ఆల్‌రౌండర్ పాండ్యాను తుది జట్టులోకి తీసుకున్నామని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్‌తో రాణిస్తాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక శ్రీలంక నుంచి ధనుష్క గుణతిలక కూడా తొలి టెస్టు ఆడుతుండటం విశేషం. గుణతిలక చాంపియన్స్ ట్రోఫీలో రాణించాడని, జింబాంబ్వే వన్డే సిరీస్ లో టాప్ స్కోరర్‌గా నిలిచాడని లంక కెప్టెన్ రంగణ హెరాత్ తెలిపాడు. తుది జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), ముకుంద్, ధావన్, పుజారా, రహానే, హార్ధిక్ పాండ్యా, సాహా, అశ్విన్, జడేజా, ఉమేశ్, షమీ. శ్రీలంక: హెరాత్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుశాల్ మెండిస్, గుణతిలక, మాథ్యూస్, డిక్వెల్లా, గుణరత్నే, పెరీరా, లాహిరు, నువాన్ ప్రదీప్.