పాండ్యా అరంగేట్రం.. అశ్విన్ @50
మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక తొలి టెస్టుకు ప్రాధాన్యత సంతరించుకుంది.
గాలె: మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక తొలి టెస్టుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్ భారత్ స్పిన్నర్ అశ్విన్‌కు 50 వ టెస్టు అయితే ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. 289 టెస్టు ఆటగాడిగా పాండ్యా కోహ్లీ చేతులు మీద క్యాప్ అందుకున్నాడు. ఇప్పటి వరకు 17 వన్డేలు 19 టీ-20లు ఆడిన పాండ్యా కెరీర్‌లో తొలి టెస్టు శ్రీలంకపై ఆడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాండ్యా అదరగొడుతాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
అశ్విన్ కెరీర్‌లో మైలురాయి
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ టెస్టు ద్వారా తన కెరీర్‌లో ఓ మైలురాయిని అందుకున్నాడు. అశ్విన్ ఇప్పటి వరకు 49 టెస్టుల్లో 275 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఈ మ్యాచ్‌తో లంక జట్టు ఆటగాడు దనుష్క గుణతిలక టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. భారత్‌పై తన తొలి టెస్టు ఆడుతోన్నాడు.