సాక్షి, ముంబయి : శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోన్న టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సెలక్టర్లు షాకిచ్చారు. ఆ టెస్ట్ సిరీస్ తొలి రెండు టెస్టులకు 15 మంది సభ్యుల జాబితాను శుక్రవారం ప్రకటించిన బీసీసీఐ అనూహ్యంగా పాండ్యాకు చోటు కల్పించలేదు. కానీ, టీమ్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెలక్టర్లు చెబుతున్నారు. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత భారత్ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా లాంటి పటిష్ట జట్లతో సుదీర్ఘ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సిరీస్‌కూగాను పాండ్యాకు విశ్రాంతినిచ్చినట్లు వెల్లడించారు.
గాయాల బారిన పడకుండా చూడటంలో భాగంగానే పాండ్యాను ఎంపిక చేయలేదని, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఆ సమయంలో పాండ్యా మరింత ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు సెలక్టర్లు, మేనేజ్ మెంట్ పేర్కొంది. కాగా.. ఇప్పుడిప్పుడే అన్ని ఫార్మాట్లకు అలవాటుపడుతున్న ఆల్ రౌండర్ పాండ్యాను, కివీస్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైనందున కావాలనే తప్పించారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. సీనియర్ ఆల్ రౌండర్లు జడేజా, అశ్విన్‌లు చాలాకాలం తర్వాత జట్టులోకొచ్చారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ 16న లంక, టీమిండియా తొలి టెస్ట్ ఆడనున్నాయి.
లంకతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ.
Comments
Please login to add a commentAdd a comment