అభిమానులకు సారీ: హార్దిక్ పాండ్యా | I am sorry, If People Think He Played Less Cricket, says hardik pandya | Sakshi
Sakshi News home page

అభిమానులకు సారీ: హార్దిక్ పాండ్యా

Published Tue, Nov 14 2017 2:42 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

 I am sorry, If People Think He Played Less Cricket, says hardik pandya - Sakshi

న్యూఢిల్లీ:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ కు  స్వయంగా విశ్రాంతి అడిగి జట్టుకు దూరంగా ఉన్న భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. అభిమానులకు సారీ చెప్పాడు. తక్కువ క్రికెట్ ఆడిన తాను విశ్రాంతి కోరడం ఏమిటని ప్రజలు భావిస్తే అందుకు వెరీ వెరీ సారీ అని హార్దిక్ పేర్కొన్నాడు. ' నేను అబద్ధం చెప్పడం లేదు. దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఆ క్రమంలోనే ప్రస్తుతం బ్రేక్ తీసుకోవాలనుకున్నా. శ్రీలంకతో సిరీస్ కు విశ్రాంతి కావాలని జట్టు యాజమాన్యాన్ని అడిగా. నా శరీరం కాస్త ఇబ్బంది పెడుతుంది.  దాంతోనే రెస్ట్ అడిగా. నా ఫిట్ నెస్ ను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతోనే విశ్రాంతి కోరా. చాలా తక్కువ టెస్టు మ్యాచ్ లు ఆడిన నేను విశ్రాంతి అడగడం ఏమిటని అభిమానులు ఫీలైతే అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా' అని హార్దిక్ తెలిపాడు.

విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న కారణంగా తన శరీరం కాస్త ఇబ్బంది పెడుతోందని, అందుకే తానే విశ్రాంతి అడిగానని హార్దిక్‌ పాండ్యా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వంద శాతం ఫిట్‌గా ఉండి తాను పూర్తి స్థాయిలో ఆడగలనని భావించినప్పుడే బరిలోకి దిగాలనేదే తన ఉద్దేశమని, విరామ సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు 24 ఏళ్ల పాండ్యా వెల్లడించాడు.శ్రీలంకతో తొలి రెండు టెస్టులకు జట్టులోకి ఎంపిక చేసి కూడా సెలక్టర్లు ఆ తర్వాత విశ్రాంతి పేరుతో పాండ్యాను పక్కన పెట్టడం విమర్శలకు దారి తీసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement