టాస్ నెగ్గిన కోహ్లీ సేన..
టాస్ నెగ్గిన కోహ్లీ సేన..
Published Wed, Jul 26 2017 10:10 AM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM
గాలే: శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ సేన టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. జ్వరం కారణంగా కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కాగా అతని స్థానంలో శిఖర్ ధావన్‌ను తీసుకున్నారు. హార్ధిక్ పాండ్యా కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్నాడు. ఇద్దరు పేసర్లు, ఇద్దరి స్పిన్నర్లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండంతో ఆల్‌రౌండర్ పాండ్యాను తుది జట్టులోకి తీసుకున్నామని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్‌తో రాణిస్తాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇక శ్రీలంక నుంచి ధనుష్క గుణతిలక కూడా తొలి టెస్టు ఆడుతుండటం విశేషం. గుణతిలక చాంపియన్స్ ట్రోఫీలో రాణించాడని, జింబాంబ్వే వన్డే సిరీస్ లో టాప్ స్కోరర్‌గా నిలిచాడని లంక కెప్టెన్ రంగణ హెరాత్ తెలిపాడు.
తుది జట్లు
భారత్: కోహ్లి (కెప్టెన్), ముకుంద్, ధావన్, పుజారా, రహానే, హార్ధిక్ పాండ్యా, సాహా, అశ్విన్, జడేజా, ఉమేశ్, షమీ.
శ్రీలంక: హెరాత్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుశాల్ మెండిస్, గుణతిలక, మాథ్యూస్, డిక్‌వెల్లా, గుణరత్నే, పెరీరా, లాహిరు, నువాన్ ప్రదీప్.
Advertisement
Advertisement