ILT20 2023: MI Emirates thump Desert Vipers by 157 runs - Sakshi
Sakshi News home page

ILT20: 86 పరుగులకే కుప్పకూలిన వైపర్స్‌.. 157 పరుగుల తేడాతో ముంబై విజయం

Published Mon, Jan 30 2023 3:52 PM | Last Updated on Mon, Jan 30 2023 4:27 PM

MI Emirates thump Desert Vipers by 157 runs  - Sakshi

ఇంటర్నేషనల్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎమిరేట్స్‌ ఏకంగా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన డెసర్ట్‌ వైపర్స్‌.. ముంబై బౌలర్లు చెలరేగడంతో 84 పరుగులకే కుప్పకూలింది.

ముంబై పేసర్‌ ఫజల్హక్ ఫారూఖీ మూడు వికెట్లు పడగొట్టి  వైపర్స్‌ వెన్ను విరచగా.. తహీర్‌, జహూర్ ఖాన్ చెరో రెండు వికెట్లు, బౌల్ట్‌, బ్రావో, మౌస్లీ తలా వికెట్‌ సాధించారు. వైపర్స్‌ బ్యాటర్లలో టామ్‌ కుర్రాన్‌(12), మార్క్‌ వాట్‌(12) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు.

చెలరేగిన వసీం, పొలార్డ్‌
ఇక టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఎమిరేట్స్‌ బ్యాటర్లలో మహ్మద్‌ వసీం విధ్వంసం సృష్టించాడు. 44 బంతులు ఎదుర్కొన్న వసీం 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫ్లెచర్‌(50), పొలార్డ్‌(50 నాటౌట్‌) రాణించారు. కాగా పొలార్డ్‌ తన అర్ధ సెంచరీని కేవలం 19 బంతుల్లోనే సాధించడం గమానార్హం. వైపర్స్‌ బౌలర్లలో టామ్‌ కుర్రాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.
చదవండిపాండ్యాది చెత్త నిర్ణయం.. నంబర్‌ 1 బౌలర్‌ విషయంలో ఎందుకలా? హుడాను మాత్రం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement