ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో విండీస్ ఆటగాళ్ల బ్యాటింగ్ విధ్వంసం కొనసాగుతోంది. శనివారం ఆటలో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కెప్టెన్ కీరోన్ పొలార్డ్ 28 బంతుల్లో 9 సిక్స్‌లు, 2 ఫోర్లతో దుమ్ములేపి 72 పరుగులు సాధిస్తే, ఆదివారం నాటిలో గయానా అమెజాన్ వారియర్స్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ పరుగుల దాహం తీర్చుకున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన పూరన్.. 45 బంతుల్లో 10 సిక్స్‌లు, 4 ఫోర్లతో శతకం సాధించాడు. ఇందులో హాట్రిక్ సిక్స్‌లు ఉండటం విశేషం. సెయింట్ కిట్స్ బౌలర్ ఇష్ సోథీ వేసిన 18 ఓవర్‌లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. జట్టు విజయానికి మూడు పరుగులు కావాల్సిన తరుణంలో సిక్స్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించాడు. దాంతో మ్యాచ్ గెలవడమే కాకుండా పూరన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది టీ20ల్లో పూరన్‌కు తొలి శతకం. పూరన్ దాటికి గయానా అమెజాన్ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.(చదవండి: పొలార్డ్ కుమ్మేశాడుగా..)
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గయానా అమెజాన్ వారియర్స్ ముందుగా సెయింట్ కిట్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో సెయింట్ కిట్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. జోషువా డా సిల్వా(59) హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన గయానా అమెజాన్ వారియర్స్ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన పూరన్ తొలుత ఆచితూచి ఆడాడు. పిచ్‌పై పట్టుదొరికిన తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక కనీసం ఓవర్‌కు సిక్స్ కొట్టాలన్న కసితో పూరన్ బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే 18 ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో విజయంలో గయానా ఆరు పాయింట్లతో మూడో స్థానానికి చేరింది.(చదవండి: తొలి బంతికే భయపడ్డాను: కోహ్లి)
Comments
Please login to add a commentAdd a comment