pooran
-
చెలరేగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్‌కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.విండీస్ ఓపెనర్లు చార్లెస్, కింగ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ వికెట్‌కు వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 23 పరుగులు చేసిన కింగ్ గాయం కారణంగా రిటైర్డ్హట్గా వెనుదిరిగాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్.. చార్లెస్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చార్లెస్ ఔటయ్యాక కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ సైతం తన బ్యాట్‌కు పని చెప్పాడు.విండీస్ బ్యాటర్లలో చార్లెస్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పూరన్(36), పావెల్(36), రుథర్‌ఫార్డ్(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అర్చర్, కుర్రాన్, మొయిన్ అలీ తలా వికెట్ సాధించారు.చదవండి: T20 WC: రోహిత్‌ను గుర్తు చేసిన కింగ్.. స్టేడియం బయటకు బంతి! వీడియో -
గెలుపు మలుపు విండీస్‌దే
ప్రావిడెన్స్ (గయానా): బ్యాటింగ్‌లో తిలక్‌వర్మ (41 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) ప్రతాపం చూపినా, బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా (3/35) నిప్పులు చెరిగినా, చహల్ (2/19) స్పిన్‌తో తిప్పినా... భారత్‌కు పరాజయం తప్పలేదు. ఆదివారం రెండో టి20లో విండీస్ 2 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 2–0తో ఆధిక్యాన్ని పెంచుకుంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ కెరీర్లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే పాండ్యా ప్రత్యర్థిని దెబ్బ తీసినా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) గెలుపుబాట వేశాడు. రేపు మూడో టి20 కూడా ఇదే వేదికపై జరుగుతుంది. తిలక్ ఫిఫ్టీతో... అరంగేట్రం చేసిన తొలి టి20లోనే ఆకట్టుకున్న హైదరాబాద్ యువ సంచలనం ఠాకూర్ తిలక్‌వర్మ ఈ రెండో మ్యాచ్‌లో అయితే భారత జట్టును ఆదుకున్నాడు. 18 పరుగులకే భారత్ కీలకమైన శుబ్‌మన్ గిల్ (7), సూర్యకుమార్ (1) వికెట్లను కోల్పోగా, కాసేపటికే ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ సామ్సన్ (7)లు వికెట్లను పారేసుకున్నాడు. ఈ దశలో తిలక్ తనశైలి స్కూప్, స్వీప్ షాట్లతో మైదానంతా ఫీల్డర్లను పరుగు పెట్టించాడు. కెప్టెన్ పాండ్యాతో కలిసి స్కోరుబోర్డులో వేగం పెంచిన వర్మ 39 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. అతనితో పాటు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 24; 2 సిక్సర్లు) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో దంచికొట్టే బ్యాటరే కరువయ్యాడు. భారీషాట్లు బాదే అక్షర్ (14) ఆట కూడా ఎంతోసేపు నిలువలేదు. దీంతో భారత్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. పూరన్ ధనాధన్ లక్ష్యఛేదన మొదలు పెట్టగానే పాండ్యా వికెట్ల భరతం పట్టడంతో తొలి ఓవర్లోనే కింగ్ (0), చార్లెస్ (2) వికెట్లను కోల్పోయిన విండీస్ కష్టాలపాలైంది. మేయర్స్ (15)ను అర్ష్ దీప్ అవుట్ చేయడంతో భారత శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహం కానీ... తర్వాత పూరన్ ఉత్పాతంలా వచ్చిపడ్డాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో బంతుల అంతరాన్ని అమాంతం తగ్గించేశాడు. 126/4 స్కోరు వద్ద గెలుపుబాటలో కనిపించింది. కానీ ఆ స్కోరువద్దే పూరన్ జోరుకు ముకేశ్ కళ్లెం వేశాడు. ఈ దశలో చహల్ స్పిన్ మ్యాజిక్‌తో హెట్‌మైర్ (22 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), హోల్డర్ (0)లను అవుట్ చేశాడు. 3 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ ఫలితం భారత్‌వైపు మలుపు తిరిగేలా కనిపించింది. కానీ హోసీన్ (16 నాటౌట్; 2 ఫోర్లు), జోసెఫ్ (10 నాటౌట్; 1 సిక్స్) తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 26 పరుగులు జోడించి టీమిండియాకు గెలుపు అవకాశమివ్వకుండా ఇంకా 7 బంతులు మిగిలుండగానే విండీస్‌ను విజయతీరానికి చేర్చారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (బి) షెఫర్డ్ 27; గిల్ (సి) హెట్‌మైర్ (బి) జోసెఫ్ 7; సూర్యకుమార్ (రనౌట్) 1; తిలక్ వర్మ (సి) మెకాయ్ (బి) హోసీన్ 51; సంజూ సామ్సన్ (స్టంప్డ్) పూరన్ (బి) హోసీన్ 7; పాండ్యా (బి) జోసెఫ్ 24; అక్షర్ (సి) పూరన్ (బి) షెఫర్డ్ 14; రవి బిష్ణోయ్ (నాటౌట్) 8; అర్ష్ దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–16, 2–18, 3–60, 4–76, 5–114, 6–129, 7–139. బౌలింగ్: మెకాయ్ 4–0–25–0, హోసీన్ 4–0–29–2, జోసెఫ్ 4–0–28–2, హోల్డర్ 4–0–29–0, షెఫర్డ్ 3–0–28–2, మేయర్స్ 1–0–12–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 0; మేయర్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 15; చార్లెస్ (సి) తిలక్ వర్మ (బి) పాండ్యా 2; పూరన్ (సి) సామ్సన్ (బి) ముకేశ్ 67; పావెల్ (సి) ముకేశ్ (బి) పాండ్యా 21; హెట్‌మైర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 22; షెఫర్డ్ (రనౌట్) 0; హోల్డర్ (స్టంప్డ్) ఇషాన్ (బి) చహల్ 0; హోసీన్ (నాటౌట్) 16; జోసెఫ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18.5 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–32, 4–89, 5–126, 6–128, 7–128, 8–129. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–35–3 అర్ష్ దీప్ 4–0–34–1, ముకేశ్ 3.5–0–35–1, బిష్ణోయ్ 4–0–31–0, చహల్ 3–0–19–12. -
‘ఆ స్థితిలో బ్యాటింగ్ వద్దే వద్దు’
షార్జా: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ చివరి బంతికి గెలిచినా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. వరుస ఓటముల తర్వాత కింగ్స్ పంజాబ్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ డౌన్లో వచ్చినా తడబాటు లేకుండా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు గేల్. 45 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లతో 53 పరుగులు సాధించిన గేల్ తన విలువ ఏమిటో చూపించాడు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన గేల్‌పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. యూనివర్శల్ బాస్ అని ముద్దుగా పిలుచుకునే గేల్‌ను సహచర ఆటగాడు నికోలస్ పూరన్ కొనియాడాడు. (గెలిచారు కదా.. మొహం అలా పెట్టావేంటి?) ‘నా ప్రకారం గేల్ ఒక గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్. గేల్ బ్యాటింగ్ చేస్తుంటే విజయం సాధించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. గేల్ ఒకసారి క్రీజ్‌లోకి వెళ్లాడంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో మెల్లగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. చాలాకాలం నుంచి గేల్ క్రికెట్ ఆడటం లేదు. కానీ మళ్లీ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. గేల్ పరుగులు సాధిస్తుంటే అద్భుతంగా ఉంటుంది. చివరి ఓవర్లో మూడు బంతులకు పరుగు మాత్రమే వచ్చింది. దాంతో నాకు ఢిల్లీతో జరిగిన మ్యాచ్ గుర్తుకొచ్చింది. డగౌట్లో ఉన్న నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అవి చాలా గందరగోళానికి గురి చేశాయి. చివరి బంతికి నాకు బ్యాటింగ్ చేసే అవకాశం చాలా కాలం తర్వాత వచ్చింది. అంత ఉత్కంఠగా ఉన్నప్పుడు ఎప్పుడూ బ్యాటింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకును. అటువంటి స్థితిలో బ్యాటింగ్ వద్దే వద్దు.. కూర్చొని కూర్చొని ఆఖరి బంతికి బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఏమి చేస్తాననే ఆందోళన ఉంది. ఆ బంతి మ్యాచ్‌ను డిసైడ్ చేసే కావడంతో టెన్షన్ పడ్డా. మ్యాచ్‌ను సిక్స్‌తో ముగించినందుకు ఆనందంగా ఉంది’ అని మ్యాచ్ తర్వాత మయాంక్ అగర్వాల్‌తో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు పూరన్.(ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి : గేల్) -
పూరన్ ఫాస్టెస్ట్ రికార్డు
దుబాయ్: కింగ్స్ పంజాబ్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ రికార్డు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పూరన్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది ఈ ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నమోదైంది. ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 202 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(9), ఫస్ట్ డౌన్ ఆటగాడు సిమ్రాన్ సింగ్(11)ల వికెట్లను ఆదిలోనే కింగ్స్ పంజాబ్ కోల్పోగా ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన పూరన్ బ్యాట్‌కు పనిచెప్పాడు. వరుస సిక్స్‌లతో దుమ్మురేపాడు. అభిషేక్ శర్మ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన పూరన్.. అబ్దుల్ సామద్ వేసిన తొమ్మిదో ఓవర్లో నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. అందులో హ్యాట్రిక్ సిక్స్‌లు సాధించాడు పూరన్. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకుని ఈ సీజన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కాగా, ఓవరాల్ ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ తరఫున ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నమోదైంది. 2018లో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో అర్థ శతకం సాధించిన రికార్డు పంజాబ్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డుగా ఉండగా, పూరన్ తాజాగా సాధించిన హాఫ్ సెంచరీ రెండోదిగా నిలిచింది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మయాంక్, సిమ్రాన్‌లతో పాటు కేఎల్ రాహుల్(11) కూడా నిరాశపరిచాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(7) రనౌట్ అయ్యాడు. పూరన్ ఒక్కడే పోరాటం చేస్తున్నా అతనికి సహకారం లభించడం లేదు. -
పూరన్... ఏం మాయ చేశాడే
షార్జా: ఐపీఎల్ టి20 టోర్నీలో రాజస్తాన్ రాయల్స్ అసాధారణ విజయం సాధించింది. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ లక్ష్యానికి పునాది వేయగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సంజూ సామ్సన్ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) గెలుపుదారిన మళ్లించాడు. వీరిద్దరి శ్రమకు రాహుల్ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) సంచలనాన్ని జతచేశాడు. 224 పరుగుల అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇదిలా ఉంచితే, పూరన్ కళ్లు చెదిరే విన్యాసంతో ఔరా అనిపించాడు. మురుగన్ అశ్విన్ 8వ ఓవర్ మూడో బంతిని సామ్సన్ పుల్ చేశాడు. డీప్ మిడ్ వికెట్లో అది సిక్సర్ అనుకున్నారంతా! కానీ పూరన్ బౌండరీలైన్ వెలుపల సెకనుతో పోటీపడి మరీ బంతి క్యాచ్ పట్టాడు. ఎడంచేత్తో మైదానంలోకి విసిరాడు. ఇదంతా క్షణకాలంలోనే జరగడం, రీప్లేలో అతని విన్యాసం స్పష్టమవడంతో అంతా వావ్ అన్నారు. టీవీ వ్యాఖ్యాతలు, సచిన్ టెండూల్కర్‌లాంటి క్రికెట్ దిగ్గజాలు సైతం పూరన్ మెరుపు విన్యాసాన్ని పొగడ్తలు, ట్వీట్లతో ముంచెత్తారు. దీనికి అంతే మెరుపు వేగంతో వేలసంఖ్యలో లైక్‌లు కొట్టారు. రీట్వీట్ చేశారు. (చదవండి: ఆఖరి ఓవర్లలో... ఆరేశారు ) రోడ్స్‌పై సచిన్ ప్రశంసలు.. పూరన్ క్యాచ్‌పై సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతటి మెరుపు ఫీల్డింగ్ తాను ఇంతకముందు ఎన్నడూ చూడలేదంటూ ప్రశంసించాడు. ఈ క్రమంలోనే కింగ్స్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్‌ను కొనియాడాడు. ‘జాంటీ ఇప్పుడు తాను బౌండరీ లైన్‌పై ఫోర్లు సేవ్ చేయడంపై మాట్లాడుతున్నా. నీ ఏరియా సాధారణంగా 30 యార్డ్లు సర్కిల్. నువ్వు ఎప్పుడూ అత్యుత్తమమే’ అని సచిన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. -
హ్యాట్రిక్ సిక్స్‌లతో సెంచరీ..
ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో విండీస్ ఆటగాళ్ల బ్యాటింగ్ విధ్వంసం కొనసాగుతోంది. శనివారం ఆటలో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కెప్టెన్ కీరోన్ పొలార్డ్ 28 బంతుల్లో 9 సిక్స్‌లు, 2 ఫోర్లతో దుమ్ములేపి 72 పరుగులు సాధిస్తే, ఆదివారం నాటిలో గయానా అమెజాన్ వారియర్స్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ పరుగుల దాహం తీర్చుకున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన పూరన్.. 45 బంతుల్లో 10 సిక్స్‌లు, 4 ఫోర్లతో శతకం సాధించాడు. ఇందులో హాట్రిక్ సిక్స్‌లు ఉండటం విశేషం. సెయింట్ కిట్స్ బౌలర్ ఇష్ సోథీ వేసిన 18 ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. జట్టు విజయానికి మూడు పరుగులు కావాల్సిన తరుణంలో సిక్స్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించాడు. దాంతో మ్యాచ్ గెలవడమే కాకుండా పూరన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది టీ20ల్లో పూరన్‌కు తొలి శతకం. పూరన్ దాటికి గయానా అమెజాన్ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.(చదవండి: పొలార్డ్ కుమ్మేశాడుగా..) ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గయానా అమెజాన్ వారియర్స్ ముందుగా సెయింట్ కిట్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో సెయింట్ కిట్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. జోషువా డా సిల్వా(59) హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన గయానా అమెజాన్ వారియర్స్ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన పూరన్ తొలుత ఆచితూచి ఆడాడు. పిచ్‌పై పట్టుదొరికిన తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక కనీసం ఓవర్‌కు సిక్స్ కొట్టాలన్న కసితో పూరన్ బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే 18 ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో విజయంలో గయానా ఆరు పాయింట్లతో మూడో స్థానానికి చేరింది.(చదవండి: తొలి బంతికే భయపడ్డాను: కోహ్లి) -
17 ఏళ్ల తర్వాత విండీస్ మరో రికార్డు
కటక్: టీమిండియాతో జరుగుతున్న చివరి వన్డేలో వెస్టిండీస్ బ్యాటింగ్‌లో సత్తాచాటింది. భారత్‌కు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానంగా పూరన్(89; 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), పొలార్డ్(74 నాటౌట్; 51 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు)లు ధాటిగా ఆడి భారత్‌కు సవాల్ విసిరారు. అయితే వీరిద్దరూ ఒక రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఐదో వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి విండీస్ మూడొందల స్కోరును సునాయాసంగా దాటడంలో సహకరించారు. కాగా, తాజాగా పూరన్-పొలార్డ్‌లు సాధించిన 135 పరుగుల భాగస్వామ్యమమే భారత్‌పై విండీస్‌కు అత్యధిక ఐదో వికెట్ భాగస్వామ్యంగా నమోదైంది. దాంతో 17 ఏళ్ల రికార్డును పూరన్-పొలార్డ్‌లు తుడిచిపెట్టేశారు. 2002లో శామ్యూల్స్-పావెల్‌లు ఐదో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని భారత్‌పై సాధించగా, దాన్ని పూరన్-పొలార్డ్‌లు జోడి బద్ధలు కొట్టింది. 17 ఏళ్ల తర్వాత విండీస్ తరఫున ఈ ఘనతను పొలార్డ్-పూరన్‌లు తిరగరాశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో విండీస్ బ్యాటింగ్‌ను లూయిస్, హోప్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల జత చేసిన తర్వాత లూయిస్ ఔట్ కాగా, కాసేపటికి హోప్ కూడా పెవిలియన్ చేరాడు. లూయిస్‌ను జడేజా పెవిలియన్‌కు పంపగా, హోప్‌ను మహ్మద్ షమీ ఔట్ చేశాడు. ఆపై రోస్టన్ ఛేజ్కు హెట్మెయిర్ జత కలిశాడు. ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత సైనీ బౌలింగ్‌లో హెట్మెయిర్ ఔటయ్యాడు.. మరో 12 పరుగుల వ్యవధిలో చేజ్‌ను సైతం సైనీ బౌల్డ్ చేశాడు. ఆ తరుణంలో నికోలస్ పూరన్‌కు జత కలిసిన పొలార్డ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. స్లాగ్ ఓవర్లలో ఈ జోడి ధాటిగా ఆడింది. బౌండరీలే లక్ష్యంగా చెలరేగింది. ఫలితంగా స్కోరు బోర్డు పరుగులు తీసింది. ప్రధానంగా పూరన్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత రెచ్చిపోయి ఆడాడు. అతనికి పొలార్డ్ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ చక్కటి సమన్వయంతో విండీస్ స్కోరును గాడిలో పెట్టారు. కాగా, శార్దూల్ ఠాకూర్ వేసిన 48 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన పూరన్ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత హోల్డర్ క్రీజ్‌లోకి రాగా, పొలార్డ్ బ్యాట్ ఝుళిపించి ఆడాడు. చివరి పది ఓవర్లలో విండీస్ 118 పరుగుల్ని సాధించడం విశేషం. -
పూరన్ మెరుపులు..పొలార్డ్ బాదుడు
కటక్: టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ 316 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఒకవైపు నికోలస్ పూరన్ మెరుపులు మెరిపించగా,మరొకవైపు కెప్టెన్ కీరోన్ పొలార్డ్ వీర బాదుడు బాదాడు. పూరన్(89; 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), పొలార్డ్(74 నాటౌట్; 51 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), షాయ్ హోప్(42;50 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. రోస్టన్ ఛేజ్(38), హెట్మెయిర్(37)లు ఫర్వాలేదనిపించడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో విండీస్ బ్యాటింగ్‌ను లూయిస్, హోప్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల జత చేసిన తర్వాత లూయిస్ ఔట్ కాగా, కాసేపటికి హోప్ కూడా పెవిలియన్ చేరాడు. లూయిస్‌ను జడేజా పెవిలియన్‌కు పంపగా, హోప్‌ను మహ్మద్ షమీ ఔట్ చేశాడు. ఆపై రోస్టన్ ఛేజ్కు హెట్మెయిర్ జత కలిశాడు. ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత సైనీ బౌలింగ్‌లో హెట్మెయిర్ ఔటయ్యాడు.. మరో 12 పరుగుల వ్యవధిలో చేజ్‌ను సైతం సైనీ బౌల్డ్ చేశాడు. ఆ తరుణంలో నికోలస్ పూరన్‌కు జత కలిసిన పొలార్డ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. స్లాగ్ ఓవర్లలో ఈ జోడి ధాటిగా ఆడింది. బౌండరీలే లక్ష్యంగా చెలరేగింది. ఫలితంగా స్కోరు బోర్డు పరుగులు తీసింది. ప్రధానంగా పూరన్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత రెచ్చిపోయి ఆడాడు. అతనికి పొలార్డ్ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ చక్కటి సమన్వయంతో విండీస్ స్కోరును గాడిలో పెట్టారు. కాగా, శార్దూల్ ఠాకూర్ వేసిన 48 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన పూరన్ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత హోల్డర్ క్రీజ్‌లోకి రాగా, పొలార్డ్ బ్యాట్ ఝుళిపించి ఆడాడు. ఈ జోడి చివరి రెండు ఓవర్లలో 32 పరుగుల్ని సాధించారు. ఇందులో 29 పరుగుల్ని పొలార్డ్ సాధించాడు. చివరి పది ఓవర్లలో 118 పరుగుల్ని విండీస్ పిండుకుంది. భారత బౌలర్లలో సైనీ రెండు వికెట్లు సాధించగా, షమీ, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది. -
అతనిపై 4 మ్యాచ్‌లు... మీపై 12 నెలలా?
బ్రిస్బేన్: ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో అతనిపై నాలుగు టీ20 మ్యాచ్‌ల నిషేధ పడింది. అయితే ఇదే తరహాలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. ఇక డేవిడ్ వార్నర్ సైతం ట్యాంపరింగ్‌లో భాగం కావడంతో అతనిపై కూడా 12 నెలలు సస్పెన్షన్ పడగా, బెన్‌క్రాఫ్‌పై 9 నెలల నిషేధం విధించారు. అయితే పూరన్‌కు ఎందుకు స్వల్ప శిక్ష పడిందని స్టీవ్ స్మిత్‌ను అడగ్గా.. అలా అతనికి తక్కువ నిషేధం పడితే తనకేమిటి సంబంధం అని ఎదురు ప్రశ్నించాడు. అతనికి ఓ మోస్తరు శిక్ష వేయడంతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నాడు. ‘ ప్రతీ ఒక్కరూ డిఫరెంట్.. ప్రతీ బోర్డు డిఫరెంట్. అక్కడ చాలా విషయాలు మిళితమై ఉంటాయి. నాకు కఠినమైన శిక్ష పడిందని నేనేమీ ఫీల్ కావడం లేదు. అది గతం. నేను గతం నుంచి ప్రస్తుతానికి వచ్చా. ఇప్పుడు వర్తమానంపై దృష్టి సారిస్తున్నా. నాకు నికోలస్ తెలుసు. అతనితో చాలా క్రికెట్ ఆడిన అనుబంధం ఉంది. అతనొక టాలెంట్ ఉన్న క్రికెటర్. పూరన్‌కు మంచి భవిష్యత్తు ఉంది. అతను చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు’ అని స్మిత్ పేర్కొన్నాడు. లక్నోలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో అతను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఐసీసీ అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. బంతి ఆకారాన్ని మార్చినట్లు పూరన్ అంగీకరించడంతో క్షమాపణలు కూడా కోరాడు. సస్పెన్షన్ కారణంగా విండీస్ ఆటగాడు తదుపరి నాలుగు టి20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్–3 నిబంధనను అతిక్రమించడంతో ఆరి్టకల్ 2.14 ప్రకారం నాలుగు సస్పెన్షన్ పాయింట్లను విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
పూరన్ సస్పెన్షన్
దుబాయ్: వెస్టిండీస్ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. లక్నోలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో అతను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. బంతి ఆకారాన్ని మార్చినట్లు పూరన్ అంగీకరించడంతో క్షమాపణలు కూడా కోరాడు. సస్పెన్షన్ కారణంగా విండీస్ ఆటగాడు తదుపరి నాలుగు టి20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్–3 నిబంధనను అతిక్రమించడంతో ఆరి్టకల్ 2.14 ప్రకారం నాలుగు సస్పెన్షన్ పాయింట్లను విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఔను... నా వల్ల తప్పు జరిగింది. ఐసీసీ శిక్షకు నేను అర్హుడినే. భవిష్యత్తులో ఇలాంటి తప్పు పునరావృతం చేయను’ అని పూరన్ జట్టు వర్గాలను క్షమాపణలు కోరాడు. -
మాయదారి మల్లిగాడితో రొమాన్స్
‘సీమ టపాకాయ్’, ‘అవును’ తదితర చిత్రాల్లో నటించి తెలుగులో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న పూర్ణ, సుధీర్‌బాబుకి జోడీగా చేయబోతున్నారు. ‘మాయదారి మల్లిగాడు’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 28న మొదలు కానుంది. హనుమ ముప్పరాజు దర్శకత్వంలో యం.రేవన్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్ కలబోతతో పూర్తిస్థాయి వినోదభరితంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు, పూర్ణల రొమాన్స్ ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రతన్, కెమెరా: బీఎల్ సంజయ్.