Saint Lucia
-
దంచికొట్టిన రోస్టన్, జోన్స్.. కింగ్స్‌దే సీపీఎల్ టైటిల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024 చాంపియన్‌గా సెయింట్ లూసియా కింగ్స్ జట్టు అవతరించింది. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. లూసియా కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఆకట్టుకోలేకపోయిన బ్యాటర్లుగయానా వేదికగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున సెయింట్ లూసియా కింగ్స్- గయానా అమెజాన్ వారియర్స్ మధ్య సీపీఎల్ టైటిల్ పోరు జరిగింది. టాస్ గెలిచిన కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.దెబ్బ కొట్టిన నూర్ అహ్మద్వారియర్స్ బ్యాటర్లలో టెయిలెండర్ ప్రిటోరియస్ 25 పరుగులతో టాప్ స్కోర్‌గా నిలవడం గమనార్హం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ షాయీ హోప్ 22 పరుగులు సాధించాడు. ఇక కింగ్స్ బౌలర్లలో స్పిన్నర్ నూర్ అహ్మద్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు.ఓపెనర్ మొయిన్ అలీ(14), హిట్టర్ షిమ్రన్ హెట్మెయిర్(11) రూపంలో కీలక వికెట్లు తీసి.. వారియర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. కింగ్స్ జట్టులోని మిగిలిన బౌలర్లలో ఖారీ పియరీ, మాథ్యూ ఫోర్డ్, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, డేవిడ్ వీస్ ఒక్కో వికెట్ పడగొట్టారు.దంచికొట్టిన రోస్టన్, జోన్స్ఇక వారియర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా కింఘ్స్ 18.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ దంచికొట్టడంతో విజయం సాధ్యమైంది. ఓపెనర్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(21) ఫర్వాలేదనిపించగా.. జాన్సన్ చార్ల్స్(7) నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ టిమ్ సిఫార్ట్ 10 బంతులు ఎదుర్కొని మూడు పరుగులే చేశాడు.ఇలాంటి దశలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 39 పరుగులతో దుమ్ములేపాడు. ఐదో స్థానంలో వచ్చిన ఆరోన్ జోన్స్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 48 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి అజేయంగా నిలిచి.. లూసియా కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. PC: SLK Xవిజేతల జాబితా ఇదేకాగా సీపీఎల్‌లో లూసియా కింగ్స్‌కు ఇదే మొట్టమొదటి టైటిల్. ఇక 2013లో వెస్టిండీస్ వేదికగా మొదలైన ఈ టీ20 టోర్నీలో జమైకా తలైవాస్ అరంగేట్ర విజేతగా నిలిచింది. తర్వాత వరుసగా బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్‌స్టీల్, జమైకా తలైవాస్, ట్రింబాగో నైట్ రైడర్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, సెయింట కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, జమైకా తలైవాస్, గయానా అమెజాన్ వారియర్స్.. తాజాగా సెయింట్ లూసియా కింగ్స్ ట్రోఫీలు కైవసం చేసుకున్నాయి.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ The wait is over 🙌 The Saint Lucia Kings are CPL Champions 🇱🇨🏆#CPL24 #CPLFinals #SLKvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/nqVbnilsAH— CPL T20 (@CPL) October 7, 2024 -
పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్: ఒక్క ఫోర్ లేదు! అన్నీ సిక్సర్లే!
వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ కీరన్ పొలార్డ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 52 పరుగులు సాధించి సత్తా చాటాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ మేరకు తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీకాగా సీపీఎల్ తాజా ఎడిషన్‌లో పొలార్డ్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లూసియా కింగ్స్ సొంత మైదానంలో మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లు, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(26 బంతుల్లో 34), జె.చార్ల్స్(14 బంతుల్లో 29) శుభారంభం అందించగా.. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన చేజ్ 40 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా భనుక రాజపక్స(29 బంతుల్లో 33) కూడా ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. ట్రిన్‌బాగో బౌలర్లలో సునిల్ నరైన్, వకార్ సలామ్‌ఖీల్ రెండేసి వికెట్లు తీయగా.. టెర్రాన్స్ హిండ్స్, పొలార్డ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆకాశమే హద్దుగా పొలార్డ్ఈ క్రమంలో లూసియా కింగ్స్ విధించిన లక్ష్య ఛేదనకు దిగిన ట్రిన్‌బాగోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు జేసన్ రాయ్(15 బంతుల్లో 16), సునిల్ నరైన్(8 బంతుల్లో 14) విఫలమయ్యారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ షకెరె పారిస్ 33 బంతుల్లో 57 పరుగులతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.సిక్సర్ల వర్షంమిగతా వాళ్లలో నికోలస్ పూరన్(17), కేసీ కార్టీ(15) పూర్తిగా నిరాశపరచగా.. పొలార్డ్ రంగంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఈ ఆల్‌రౌండర్. ఏడు సిక్సర్ల సాయంతో 19 బంతుల్లోనే 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పందొమ్మిదో ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆఖరి ఓవర్లో అకీల్ హొసేన్ ఫోర్ బాదడంతో.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ట్రిన్‌బాగో గెలుపు ఖరారైంది. లూయిస్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన కీరన్ పొలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.సెయింట్ లూయీస్ వర్సెస్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ స్కోర్లులూయీస్ కింగ్స్- 187/6 (20 ఓవర్లు)నైట్ రైడర్స్- 189/6 (19.1 ఓవర్లు)ఫలితం- కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ విజయం.టాప్‌లో అమెజాన్ వారియర్స్కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో గయానా అమెజాన్ వారియర్స్ మూడు విజయాల(ఆరు పాయింట్లు)తో పట్టికలో టాప్‌లో ఉండగా.. బార్బడోస్ రాయల్స్ రెండింట రెండు గెలిచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ట్రిన్‌బాగో నైట్ రైడర్స్మూడింట రెండు గెలిచి మూడు, ఆంటిగ్వా-బర్బుడా ఫాల్కన్స్ ఆరింట రెండు గెలిచి నాలుగు, సెయింట్ లూసియా కింగ్స్ నాలుగింట రెండు గెలిచి ఐదు, సెయింట్ కిట్స్- నెవిస్ పేట్రియాట్స్ ఆరింట ఒకటి గెలిచి అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.చదవండి: హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే..! Kieron Pollard is awarded @Dream11 MVP! Well done Polly 🙌🏾 #CPL24 #SLKvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Dream11 pic.twitter.com/AASf9KO7mC— CPL T20 (@CPL) September 11, 2024 -
CPL 2024: రాణించిన నూర్ అహ్మద్, సీఫర్ట్
కరీబియర్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో సెయింట్ లూసియా కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో నూర్ అహ్మద్ (4-0-18-3), బ్యాటింగ్‌లో టిమ్ సీఫర్ట్ (11 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించి లూసియా కింగ్స్‌ను గెలిపించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జస్టిన్ గ్రీవ్స్ (36), ఇమాద్ వసీం (29 నాటౌట్), ఫఖర్ జమాన్ (21) పర్వాలేదనిపించారు. లూసియా కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్‌తో పాటు డేవిడ్ వీస్, అల్జరీ జోసఫ్, రోస్టన్ ఛేజ్, ఖారీ పియెర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన లూసియా కింగ్స్.. 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సీఫర్ట్ మెరుపు వేగంతో పరుగులు చేయగా.. జాన్సన్ ఛార్టెస్ (46 బంతుల్లో 47 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడాడు. డుప్లెసిస్ 28, రాజపక్ష 9, అకీమ్ 27 పరుగులు చేశారు. ఫాల్కన్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, క్రిస్ గ్రీన్, ఫేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో భాగంగా రేపు సెయింట్ కిట్స్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. -
రసెల్ ఆల్‌రౌండ్ మెరుపులు.. సెమీస్ ఆశలు సజీవం
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్( సీపీఎల్ 2021)లో భాగంగా గురువారం జమైకా తలైవాస్, సెంట్ లూసియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జమైకా తలైవాస్ ఘన విజయాన్ని అందుకుంది. రసెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచడంతో జమైకా తలైవాస్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.. ఇక సెంట్ లూసియా వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కెన్నర్ లూయిస్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో పొలార్డ్(31,15 బంతులు; 4 సిక్సర్లు), ఇమాద్ వసీమ్(27, 10 బంతులు; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. సెంట్ లూసియా బౌలింగ్‌లో జెవర్ రాయల్, కదీమ్ అలీన్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ లూసియా 156 పరుగులకే ఆలౌట్ అయింది. మార్క్ డేయల్ 33, ఆండ్రీ ఫ్లెచర్ 30 పరుగులు చేశారు. ఇమాద్ వసీమ్ 3, రసెల్ 2, కార్లోస్ బ్రాత్‌వైట్ 2 వికెట్లతో రాణించారు. ఈ విజయంతో తలైవాస్ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4 ఓటములతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా.. సెంట్ లూసియా కూడా 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4ఓటములతోనే ఉంది. అయితే నెట్ రన్‌రేట్ విషయంలో మైనస్‌లో ఉండడంతో నాలుగో స్థానంలో ఉంది. చదవండి: ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగులు MVP!!! An all round performance with bat and ball sees Imad Wasim pick up the @Dream11 MVP for match 24. #CPL21 #SLKvJT #CricketPlayedLouder #Dream11 pic.twitter.com/tFBWoJvGRu — CPL T20 (@CPL) September 10, 2021 -
వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి..
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2021లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదో బంతిని సెయింట్ లూసియా కింగ్స్ పేసర్ వాహబ్ రియాజ్ వేయగా సీఫెర్ట్ ఎదుర్కొన్నాడు. పూర్తిగా ఆఫ్ సైడ్ వెళ్లిన ఆ బంతిని(డబుల్ వైడ్) సీఫెర్ట్ కిందపడి మరి ఆడినా.. అందలేదు. కనీస క్రికెట్ పరిజ్ఞానం లేని వారు కూడా దీన్ని వైడ్‌గా ప్రకటిస్తారు. అయితే, ఫీల్డ్ అంపైర్ నిగెల్ డుగుయిడ్ ఈ బంతిని వైడ్‌గా ప్రకటించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Polly : Are you blind? Umpire : Yes Pollard walks away 😂😂😂 #TKRvSLK #CPL2021 @KieronPollard55 pic.twitter.com/NGjSdMqmYu — Thakur (@hassam_sajjad) August 31, 2021 దీనిపై నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ట్రిన్‌బాగో కెప్టెన్ పొలార్డ్ తనదైన శైలిలో అసహనం వ్యక్తం చేశాడు. నిర్ధేశిత ప్రాంతంలో కాకుండా వికెట్లకు దూరంగా వెళ్లి 30 యార్డ్ సర్కిల్ దగ్గర నిలబడి తన నిరసన వ్యక్తం చేశాడు. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీడియో చూసిన అభిమానుల తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంపైర్ తప్పిదాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని కొందరంటుంటే.. వైడ్ బాల్ కూడా థర్డ్ అంపైరే చూసుకోవాలని మరికొందరు ట్వీటారు. మొత్తానికి అభిమానులు సదరు అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్), టిమ్ సీఫెర్ట్ (25 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సెయింట్ లూసియా కింగ్స్ పేసర్ కేస్రిక్ విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆండ్రీ ఫ్లెచర్ ( 55 బంతుల్లో 81; 6 ఫోర్లు, నాలుగ సిక్సర్లు) ఒంటరి పోరాటం వృధా అయ్యింది. రవి రాంపాల్ మూడు వికెట్లతో లూసియా కింగ్స్ పతనాన్ని శాసించాడు. చదవండి: ఏ దేశ క్రికెట్ జట్టైనా అఫ్గాన్‌లో పర్యటించవచ్చు: తాలిబన్ ప్రతినిధి -
లలిత్ మోదీ.. బ్రిటన్ టూ కరీబియన్!
లండన్:ఆర్థిక నేరారోపణలతో భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోదీ చట్టం నుంచి తప్పించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భారత్ లో అతనిపై ఉచ్చు బిగుసుకోవడంతో బ్రిటన్ నుంచి కరీబియన్‌కు వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని పొందేందుకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా సెయింట్ లూసియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ పెట్టుబడుల స్కీమ్ ద్వారా కరీబియన్ పౌరసత్వాన్ని పొందాలని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత తక్కువ మొత్తంలో పన్ను చెల్లించే వెసులుబాటు సెయింట్ లూసియాలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో పాటు సెయింట్ లూసియానాలో బ్యాంకింగ్ స్టాండర్డ్స్ అత్యంత గోప్యత కల్గి ఉండటం కూడా అక్కడ పౌరసత్వంపై మోదీ ఆసక్తి కనబరచడానికి మరో కారణం. తన కుటుంబంతో కలిసి సెయింట్ లూసియా పౌరసత్వానికి మోదీ దరఖాస్తు చేసినట్లు జాతీయ మీడియాలో వెలుగు చూసింది. కాగా, వివాదాస్పద లలిత్ మోదీ తమ దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేయడంపై సెయింట్ లూసియా ఇంటర్ పోల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అతనిపై ఏ విధమైన క్రిమినల్ కేసులు లేవని స్పష్టత వచ్చిన పక్షంలోనే తమ దేశ పౌరసత్వాన్ని ఇవ్వాలని సెయింట్ లూసియా భావిస్తోంది.