వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు | WI vs ENG: Pooran, Russell, Hetmyer back in West Indies squad for 1st Two T20s | Sakshi
Sakshi News home page

ENG vs WI: వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు

Published Sat, Nov 9 2024 12:25 PM | Last Updated on Sat, Nov 9 2024 3:47 PM

WI vs ENG: Pooran, Russell, Hetmyer back in West Indies squad for 1st Two T20s

స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న వెస్టిండీస్‌.. ఇప్పుడు అదే జ‌ట్టుతో టీ20 సిరీస్‌కు సిద్ద‌మైంది. ఇంగ్లీష్ జ‌ట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో విండీస్ త‌ల‌ప‌డ‌నుంది. బార్బోడ‌స్ వేదిక‌గా నవంబ‌ర్ 9 (శ‌నివారం) నుంచి జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 

ఈ క్ర‌మంలో ఈ సిరీస్‌లో మొద‌టి రెండు టీ20ల‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్,షిమ్రాన్ హెట్మెయర్‌లు తిరిగి జ‌ట్టులో చేరారు. వీరు ముగ్గురు గ‌త నెల‌లో శ్రీలంక‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌కు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూర‌మ‌య్యారు.

మ‌రోవైపు  ఫాబియన్ అలెన్, అలిక్ అథానాజ్, ఆండ్రీ ఫ్లెచర్‌, షమర్ స్ప్రింగర్‌లు ఈ జ‌ట్టులో చోటు ద‌క్కించ‌లేక‌పోయారు. అదేవిధంగా స్టార్ పేస‌ర్ జోష‌ఫ్‌పై నిషేధం ప‌డ‌డ‌టంతో తొలి రెండు మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు.

ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20ల‌కు విండీస్ జ‌ట్టు
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, టెరెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రోథర్‌ఫోర్డ్,

వెస్టిండీస్ సిరీస్‌కు ఇంగ్లండ్ జ‌ట్టు
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్‌టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement