IPL 2022: వయసై పోతోందన్నాడు... కానీ.. | IPL 2022: Umesh Yadav Told He Is Getting Older I Told Him He Getting Fitter | Sakshi
Sakshi News home page

IPL 2022: వయసై పోతోందన్నాడు... కానీ: శ్రేయస్‌ అయ్యర్‌

Published Sat, Apr 2 2022 1:09 PM | Last Updated on Sat, Apr 2 2022 1:19 PM

IPL 2022: Umesh Yadav Told He Is Getting Older I Told Him He Getting Fitter - Sakshi

IPL 2022- KKR Vs PBKS: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌పై ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ప్రశంసలు కురిపించాడు. అతడిలో కష్టపడే తత్వం ఎక్కువని, అలాంటి వ్యక్తితో కలిసి ఆడటం తనకు గర్వకారణమని కొనియాడాడు. కాగా ముంబైలోని వాంఖడే వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఘన విజయం సాధించిన తెలిసిందే.

ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టికరిపించి.. ఈ సీజన్‌లో తమ రెండో గెలుపును నమోదు చేసింది. 34 ఏళ్ల ఉమేశ్‌ యాదవ్‌ అద్భుత బౌలింగ్‌కు తోడు 33 ఏళ్ల ఆండ్రీ రసెల్‌ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఈ విజయం సాధ్యమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కేకేఆర్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ ఉమేశ్‌ యాదవ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘తనకు వయసై పోతుందని ఉమేశ్‌ నాతో అన్నాడు. కానీ నేను మాత్రం నువ్వు రోజురోజుకు ఫిట్‌గా తయారవుతున్నావని చెప్పాను. జిమ్‌కు ఎప్పుడు వెళ్లినా ఉమేశ్‌ కసరత్తులు చేస్తూ కనిపిస్తాడు. అతడిది కష్టపడే తత్వం. తను నా సహచర ఆటగాడిగా ఉండటం గొప్ప విషయం’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ వ్యాఖ్యానించాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ స్కోర్లు:
పంజాబ్‌ కింగ్స్‌- 137 (18.2)
కేకేఆర్‌- 141/4 (14.3).

చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement