
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో ఆండ్రీ రసెల్ తన విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఫామ్‌లోకి వస్తే ఎంతటి డేంజర్ బ్యాట్స్‌మన్ అనేది చెప్పకనే చెప్పాడు. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రసెల్ ఆట స్వరూపాన్నే మార్చేశాడు. ఆరంభంలో కాస్త నిధానంగా కనిపించిన రసెల్ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో గేర్ మార్చాడు. హర్‌ప్రీత్ బార్ వేసిన పదో ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన రసెల్ మొత్తంగా 17 పరుగులు పిండుకున్నాడు.
ఆ తర్వాత ఓడియన్ స్మిత్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్మిత్ వేసిన ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్, నో బాల్ సహా మొత్తం 24 పరుగులు రసెల్ పిండుకోగా.. చివరి బంతిని సామ్ బిల్లింగ్స్ సిక్సర్ సంధించడంతో మొత్తంగా ఆ ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కావడంతో పాటు స్మిత్‌కు రసెల్ చుక్కలు చూపించాడు.
ఆండ్రీ రసెల్ విధ్వంసం కోసం క్లిక్ చేయండి
చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్ అంటే ఉమేశ్ యాదవ్‌కు ఎందుకంత ఇష్టం!
PERSISTENCE. RESILIENCE. DOMINANCE. 💜#KKRHaiTaiyaar #KKRvPBKS #IPL2022 pic.twitter.com/axcYImDqkg
— KolkataKnightRiders (@KKRiders) April 1, 2022