Courtesy: IPL Twitter
ప్రతీ క్రికెటర్‌కు ఒక ఫెవరెట్ జట్టు ఉంటుంది. ప్రతీ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయకున్నప్పటికీ తనకు ఇష్టమైన జట్టుతో మ్యాచ్ అంటే చాలు సదరు బౌలర్‌కు ఉత్సాహం ఉరకలేస్తుంది. అది అంతర్జాతీయ మ్యాచ్ లేదా ఐపీఎల్ లాంటి లీగ్ కావొచ్చు. కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కూడా పంజాబ్ కింగ్స్ పేరు వింటే చాలు విరుచుకుపడతాడు. ఆ జట్టు అంటే ఉమేశ్ యాదవ్‌కు ఎందుకంత ఇష్టం అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
విషయంలోకి వెళితే.. పంజాబ్ కింగ్స్‌పై ఉమేశ్‌కు మంచి గణాంకాలు ఉన్నాయి. తాజాగా ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను మరోసారి మెరిశాడు. నాలుగు ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ఉమేశ్ యాదవ్‌కు ఇది అత్యుత్తమం అని చెప్పొచ్చు. ఇంతకముందు ఇదే పంజాబ్ కింగ్స్‌పై 2017లో (4/33), 2022లో ముంబై ఇండియన్స్‌పై
(4/24) నమోదు చేశాడు.
ఇక పంజాబ్ కింగ్స్‌పై ఉమేశ్ యాదవ్ ఇప్పటివరకు 33 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఉమేశ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఇక సునీల్ నరైన్ 32 వికెట్లతో(పంజాబ్ కింగ్స్‌పై) రెండో స్థానంలో, లసిత్ మలింగ 31 వికెట్లతో (సీఎస్‌కేపై) మూడో స్థానంలో, డ్వేన్ బ్రావో 31 వికెట్లతో( ముంబై ఇండియన్స్‌పై) నాలుగు, అమిత్ మిశ్రా 30 వికెట్లతో(రాజస్తాన్ రాయల్స్) ఐదు స్థానాల్లో ఉన్నారు.
చదవండి: Umesh Yadav: పూర్వ వైభవం సాధించే పనిలో క్రికెటర్.. ఐపీఎల్‌లో అరుదైన ఫీట్
Comments
Please login to add a commentAdd a comment