ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పె...
కృష్ణా, సాక్షి: గన్నవరం ఎయిర్‌పోర్టు�...
ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి ...
బెంగళూరు, సాక్షి: కర్ణాటక రోడ్డు మరోస�...
హైదరాబాద్, సాక్షి: సంక్షేమ పథకాల లబ్�...
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోన�...
విజయవాడ, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధ�...
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజర�...
పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రత�...
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో ...
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వ�...
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి రాజకీయం మారుత�...
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ...
Published Fri, Apr 1 2022 7:02 PM | Last Updated on Fri, Apr 1 2022 10:46 PM
IPL 2022: పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆండ్రీ రసెల్ (31 బంతుల్లో 70, 2 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రసెల్ మెరుపులు మెరిపించాడు. సిక్సర్ల వర్షంతో లక్ష్యం చిన్నదిగా మారిపోయింది. అతనికి తోడుగా సామ్ బిల్లింగ్స్ కూడా 24 పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ 2 వికెట్లు, కగిసో రబాడ, ఓడియన్ స్మిత్ తలా ఒక వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 137 పరుగుల వద్ద ఆలౌటైంది. బానుక రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో రబాడ 16 బంతుల్లో 25 రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, సౌథీ 2, శివమ్ మావి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ తలా ఒక వికెట్ తీశారు.
కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపిస్తుండడంతో కేకేఆర్ స్కోర్‌బోర్డు పరుగులెత్తుతుంది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రసెల్ 44, సామ్ బిల్లింగ్స్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ తడబడుతోంది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. రసెల్ 2, సామ్ బిల్లింగ్స్ 11 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 26 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తన తర్వాతి బంతికే నితీష్ రాణాను రాహుల్ చహర్ డకౌట్ చేశాడు.
అజింక్య రహానే(12) రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఓడియన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 137 పరుగుల వద్ద ఆలౌటైంది. బానుక రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో రబాడ 16 బంతుల్లో 25 రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, సౌథీ 2, శివమ్ మావి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ తలా ఒక వికెట్ తీశారు.
కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ తన రెండో స్పెల్‌లో మరోసారి విజృంభించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతికి హర్‌ప్రీత్ బార్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఉమేశ్.. నాలుగో బంతికి రాహుల్ చహర్‌ను డకౌట్ చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 102 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 15 ఓవర్లలో 102 పరుగులు చేసింది.
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అండర్-19 కుర్రాడు రాజ్ బవా(11) సునీల్ నరైన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
8 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ 14, రాజ్ బవా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 16 పరుగులు చేసిన ధావన్ సౌథీ బౌలింగ్‌లో సామ్ బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు
5 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 12, లియామ్ లివింగ్ స్టోన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 9 బంతుల్లో 31 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన బానుక రాజపక్స శివమ్ మావి బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఒక పరుగు చేసిన మయాంక్ అగర్వాల్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన కేకేఆర్ .. ఆర్సీబీతో జరిగిన రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. మరోవైపు ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని అవలీలగా చేధించి బోణీ కొట్టింది.
ఇక ఇరుజట్లు ఇప్పటివరకు 29సార్లు తలపడగా.. కేకేఆర్ 19సార్లు.. పంజాబ్ 10సార్లు విజయాలు సాధించాయి. గత సీజన్లో ఇరుజట్లు రెండో సార్లు పోటీపడగా.. కేకేఆర్, పంజాబ్ చెరో విజయాన్ని అందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment