odean smith
-
Odean Smith: ఓ మ్యాచ్‌లో విలన్‌గా, రెండు మ్యాచ్‌ల్లో హీరోగా..!
IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన హైఓల్టేజీ పోరులో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ చేతిలో 12 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ ఓటమితో ముంబై ప్రస్తుత సీజన్లో వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుని, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రోహిత్ సేనను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌లో సత్తా చాటిన మయాంక్ సేన.. ప్రత్యర్థికి 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం పంజాబ్ ప్లేయర్లు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ ప్రతాపం చూపి, ముంబై ఇండియన్స్‌ను 186 పరుగులకే కట్టడి చేశారు. పంజాబ్ ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలి ఇద్దరు (తిలక్ వర్మ, పోలార్డ్) కీలక ప్లేయర్లను రనౌట్ చేయగా, బౌలింగ్‌లో ఓడియన్ స్మిత్ విశ్వరూపాన్ని ప్రదర్శించి చివరి ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబై గెలుపుకు 6 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన దశలో బంతిని అందుకున్న స్మిత్.. అద్భుతమైన బంతులు సంధించి ముంబై లోయరార్డర్‌ను కకావికలం చేశాడు. ఈ మ్యాచ్‌లో బంతితో రాణించి పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్మిత్.. తన తొలి ఐపీఎల్ సీజన్లోనే మిశ్రమ అనుభవాలను రుచి చూశాడు. ఆర్సీబీతో జరిగిన తన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విశ్వరూపం (8 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) చూపి పంజాబ్‌ను గెలిపించిన స్మిత్.. కేకేఆర్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లో బంతితో ఘోరంగా విఫలమై, జట్టు ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఆ మ్యాచ్‌లో రసెల్ విధ్వంసం ధాటికి బలైన స్మిత్.. ఒకే ఓవర్లో 24 పరుగులు సమర్పించుకుని పంజాబ్ అభిమానుల దృష్టిలో విలనయ్యాడు. అయితే తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తిరిగి గాడిలో పడిన అతను.. విలన్ ఇమేజ్ నుంచి బయటపడి హీరో ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. చదవండి: దటీజ్ జానియర్ 'ఏబీ'.. ఐపీఎల్ 2022లోనే భారీ సిక్సర్.. వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పంజాబ్ బౌలర్‌కు చుక్కలు చూపించిన రసెల్
ఐపీఎల్ 2022లో ఆండ్రీ రసెల్ తన విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఫామ్‌లోకి వస్తే ఎంతటి డేంజర్ బ్యాట్స్‌మన్ అనేది చెప్పకనే చెప్పాడు. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రసెల్ ఆట స్వరూపాన్నే మార్చేశాడు. ఆరంభంలో కాస్త నిధానంగా కనిపించిన రసెల్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో గేర్ మార్చాడు. హర్‌ప్రీత్ బార్ వేసిన పదో ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన రసెల్ మొత్తంగా 17 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత ఓడియన్ స్మిత్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్మిత్ వేసిన ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్, నో బాల్ సహా మొత్తం 24 పరుగులు రసెల్ పిండుకోగా.. చివరి బంతిని సామ్ బిల్లింగ్స్ సిక్సర్ సంధించడంతో మొత్తంగా ఆ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కావడంతో పాటు స్మిత్‌కు రసెల్ చుక్కలు చూపించాడు. ఆండ్రీ రసెల్ విధ్వంసం కోసం క్లిక్ చేయండి చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్ అంటే ఉమేశ్ యాదవ్‌కు ఎందుకంత ఇష్టం! PERSISTENCE. RESILIENCE. DOMINANCE. 💜#KKRHaiTaiyaar #KKRvPBKS #IPL2022 pic.twitter.com/axcYImDqkg — KolkataKnightRiders (@KKRiders) April 1, 2022 -
పంజాబ్ విజయంపై 'ఆ సినిమా' ప్రభావం.. అదే స్పూర్తితో..!
Punjab Kings: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో బ్యాటర్లు చెలరేగి ఆడటంతో రెండు మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో 38.2 ఓవర్లలోనే 356 పరుగులు నమోదు కాగా.. ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 413 పరుగులు (39 ఓవర్లలో) రికార్డయ్యాయి. ఇరు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే (ముంబై 177/5, ఆర్సీబీ 205/2) భారీ స్కోర్లు నమోదు చేశాయనుకుంటే, ఛేదనకు దిగిన జట్లు (డీసీ 179/6, పంజాబ్ 208/5) మరింత రెచ్చి పోయి కొండంత లక్ష్యాలను సునాయాసంగా ఊదేశాయి. ముఖ్యంగా ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోటీపడి పరుగులు సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (57 బంతుల్లో 88; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), విరాట్ కోహ్లి (29 బంతుల్లో 41; ఫోర్, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఏమాత్రం తగ్గేదిలేదంటూ లక్ష్యాన్ని ఊదేసింది. Odean Smith's strike-rate in that innings sits inside the top 20 in IPL history (min. 25 runs) An incredible tournament debut 💥#IPL2022 pic.twitter.com/KTbJ4xzHQl — Wisden (@WisdenCricket) March 27, 2022 పంజాబ్ జట్టులో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32), శిఖర్ ధవన్ (43), భానుక రాజపక్స (43), లియామ్ లివింగ్‌స్టోన్ (19), షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 24 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఒడియన్ స్మిత్ (8 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) తలో చేయి వేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. అయితే, పంజాబ్ ఇంతలా రెచ్చిపోయి కొండంత లక్ష్యాన్ని కరిగించడానికి ఓ సినిమా కారణమని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఓడియన్ స్మిత్ వెల్లడించాడు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు పంజాబ్ ఆటగాళ్లు 14 పీక్స్ అనే నేపాలీ ఇంగ్లీష్ మూవీ చూశారట. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ అనే ట్యాగ్‌లైన్ కలిగిన ఈ మూవీ పంజాబ్ ఆటగాళ్లలో స్పూర్తిని రగిలించిందని స్మిత్ పేర్కొన్నాడు. ఏడు నెలల కాలంలో మౌంట్ ఎవరెస్ట్ సహా 14 అత్యున్నత పర్వతాలను అధిరోహించడం అనే పాయింట్ మీద తెరకెక్కిన ఈ సినిమాను జట్టు కోచ్ అనిల్ కుంబ్లే ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయించాడని, ఈ సినిమా ఇచ్చిన ఊపుతోనే భారీ టార్గెట్‌ను ఊదేయగలిగానని స్మిత్ వ్యాఖ్యానించాడు. 14 పీక్స్ లాగే తాము కూడా 14 మ్యాచ్‌ల అవరోధాన్ని అధిరోహిస్తామని, ప్రస్తుతం తొలి అవరోధాన్ని అధిగమించామని స్మిత్ పేర్కొన్నాడు. కాగా, ఛేదనలో సిరాజ్ వేసిన 18వ ఓవర్లో స్మిత్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఏకంగా 3 సిక్సర్లు, ఫోర్ సహా 25 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసి పంజాబ్ విజయానికి దోహదపడింది. చదవండి: ఓటమిని తట్టుకోవడం కష్టమే.. అయితే: విరాట్ కోహ్లి ట్వీట్ వైరల్