
న్యూఢిల్లీ: ఓవరాల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు టైటిల్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012లో గౌతం గంభీర్ నేతృత్వంలోని తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్.. 2014లో మరొకసారి గంభీర్ సారథ్యంలోనే ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి టైటిల్‌ను సాధించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి చాంపియన్స్‌గా నిలవగా, రెండో సారి కింగ్స్ పంజాబ్‌ను మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే తమ జట్టులో మొదట్నుంచీ విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ ఉంటే మరిన్ని టైటిల్స్‌ను సాధించేవాళ్లమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. తాను కేకేఆర్‌కు ఆడిన ఏడేళ్ల కాలంలో రసెల్ కూడా ఉండి ఉంటే తాము కనీసం మరొక ఒకటి-రెండు టైటిల్స్ గెలిచేవాళ్లమన్నాడు. (డీకాక్ స్థానం ఎవరిది.. ఇంకా నో క్లారిటీ!)
2012లో రసెల్ తొలిసారి ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే ఢిల్లీ(డేర్‌డెవిల్స్) తరఫున రసెల్ తొలినాళ్లలో ప్రాతినిథ్యం వహించాడు. 2014 వేలంలో రసెల్‌ను కేకేఆర్ కొనుగోలు చేయగా ఆ ఏడాదే కేకేఆర్ టైటిల్‌ను కూడా గెలిచింది. ఆ సీజన్‌లో రసెల్‌కు కేకేఆర్ కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే అవకాశం కల్పించింది. 2015 సీజన్‌లో రసెల్ 192 స్టైక్‌రేట్‌తో 326 పరుగులు సాధించడమే కాకుండా, 14 వికెట్లతో ఆకట్టుకున్నాడు. 2016 సీజన్‌లో 188 పరుగులతో పాటు 15 వికెట్లను రసెల్ తన ఖాతాలో వేసుకన్నాడు.ఆపై ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న రసెల్.. 2018 సీజన్‌లో సైతం రాణించాడు. 300కు పైగా పరుగులు 13 వికెట్లను రసెల్ సాధించాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలో రసెల్ కీలక పాత్ర పోషించినా, ఆ జట్టు ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. (నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా..?)