KKR Vs SRH: ర‌స్సెల్ ఊచ‌కోత‌.. వణికిపోయిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు! 25 బంతుల్లోనే | IPL 2024: Andre Russell Smashes Three Sixes In An Over Against SRH Spinner Mayank Markande, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 SRH Vs KKR: ర‌స్సెల్ ఊచ‌కోత‌.. వణికిపోయిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు! 25 బంతుల్లోనే

Published Sat, Mar 23 2024 9:39 PM | Last Updated on Sun, Mar 24 2024 5:47 PM

Andre Russell smashes three sixes in an over against SRH spinner Mayank Markande - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ విధ్వంసం సృష్టించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఊచకోత కోశాడు.

ఈ క్రమంలో కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా  25 బంతులు ఎదుర్కొన్న రస్సెల్‌ 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. రస్సెల్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌పై రస్సెల్‌కే ఇదే తొలి ఫిప్టీ కావడం విశేషం.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌.. రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్‌తో పాటు ఫిల్ సాల్ట్‌(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే రెండు, కమ్మిన్స్ ఒక్క వికెట్ సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement