Russell Diamond Duck.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్‌ను దురదృష్టం వెంటాడింది. ఒక్క బంతి ఎదుర్కోకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతిని తస్కిన్ అహ్మద్ రోస్టన్ చేజ్‌కు విసిరాడు. అతను స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న తస్కిన్ అహ్మద్ కాలితో బంతిని టచ్ చేయడం.. అది వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేయడం జరిగిపోయింది. అప్పటికే క్రీజు బయటికి వచ్చేసిన రసెల్ ఎవరు ఊహించని విధంగా రనౌట్(డైమండ్ డక్)అయ్యాడు.
చదవండి: IND Vs NZ: కోహ్లి రెండుసార్లు ఓడిపోయావు.. మరి ఈసారైనా!
ఇక టి20 ప్రపంచకప్‌ల్లో డైమండ్ డక్(ఒక్క బంతి ఎదుర్కోకకుండా ఔటవ్వడం) అయిన ఆటగాళ్ల జాబితాలో రసెల్ తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు డానియల్ వెటోరి(న్యూజిలాండ్), మొహమ్మద్ అమీర్(పాకిస్తాన్), మైకెల్ యార్డి(ఇంగ్లండ్), మిస్బా-ఉల్-హక్(పాకిస్తాన్), టి దిల్షాన్(శ్రీలంక), మహేళ జయవర్ధనే(శ్రీలంక), డేవిడ్ విల్లీ(ఇంగ్లండ్), ముస్తాఫిజుర్ రెహమాన్(బంగ్లాదేశ్) ఉన్నారు.
చదవండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే
Russell is run out by Taskin Ahmed for zero via @t20worldcup https://t.co/oTxgZEv65E
— varun seggari (@SeggariVarun) October 29, 2021
Comments
Please login to add a commentAdd a comment