వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ అండ్రీ రస్సెల్ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. విండీస్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగానే రస్సెల్ జట్టుకు దూరంగా ఉంటున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. రస్సెల్ చివరగా యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో విండీస్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.
అప్పటి నుంచి కరేబియన్ జట్టుకు కూడా కేవలం ఫ్రాంచైజీ లీగ్‌ల్లోనే ఆడుతూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం రస్సెల్ తన నిర్ణయం మార్చుకున్నాడు. మళ్లీ వెస్టిండీస్ జెర్సీని ధరించాలని అనుకుంటున్నట్లు రస్సెల్ తాజాగా ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటుంది. వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్, స్కాట్లాండ్ వంటి పసికూనల చేతిలో ఓటమి పాలైన విండీస్.. భారత్ వేదికగా జరగనున్న ప్రాధాన టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలో రస్సెల్ వంటి ఆటగాళ్లు సేవలు కచ్చితంగా విండీస్ అవసరం.
"నేను ఇకపై విండీస్ క్రికెట్‌కు అందుబాటులో ఉండనున్నాను. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భాగం కావడమే నా లక్ష్యం. జట్టులోకి తిరిగి రావడానికి అన్ని విధాల సిద్దంగా ఉన్నాను. ప్రపంచకప్‌కు కంటే ముందు వైట్‌బాల్ సిరీస్‌లలో కూడా ఆడాలి అనుకుంటున్నాను. త్వరలో టీమిండియాతో జరగనున్న సిరీస్‌కు నాకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నాను.
అయితే విండీస్ తరపున నేను ఆడాలంటే రెండు ఫాంచైజీ లీగ్‌లకు దూరం కావాలి. నేను అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రపంచకప్ వంటి ఈవెంట్‌లో అద్భుతంగా రాణించి నా జట్టుకు మరో టైటిల్‌ను అందించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను. నేను మా వైట్ బాల్ కోచ్ డారెన్ సామీతో టచ్‌లో ఉన్నాను.
అతడు కూడా నా పట్ల పాజిటివ్ మైండ్‌తో ఉన్నాడని" జమైకా అబ్జర్వర్‌తో రస్సెల్ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్ తలపడనుంది. ట్రినిడాడ్ వేదికగా ఆగస్టు 3 నుంచి జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో రస్సెల్ విండీస్ తరపున రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
చదవండి: #Ishan Kishan: ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా? ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా? ఎంత అందంగా ఉందో
Comments
Please login to add a commentAdd a comment