
ఆంటిగ్వా: ఐపీఎల్‌లో అదరగొడుతున్న విధ్వంసకర ఆటగాళ్లు గేల్ (కింగ్స్ పంజాబ్), రస్సెల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నా రు. ఈ మేరకు జాసన్ హోల్డర్ సారథ్యంలోని 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. అయితే పొలార్డ్, నరైన్‌కు మాత్రం చుక్కెదురైంది. గేల్, రసెల్‌లను మాత్రమే పరిగణలోకి తీసుకున్న విండీస్ క్రికెట్ బోర్డు.. పొలార్డ్, నరైన్‌లకు మాత్రం ఉద్వాసన పలికింది.
వెస్టిండీస్ వరల్డ్‌కప్ జట్టు
హోల్డర్ (కెప్టెన్), క్రిస్‌గేల్, ఆష్లే నర్స్, రసెల్, కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, ఎవిన్ లూయిస్, ఫాబియన్ అలెన్, కీమర్ రోచ్, పూరన్ (వికెట్‌కీపర్), ఒషానె థామస్, షాయ్ హోప్, షానన్ గాబ్రియెల్, షెల్డన్ కొట్రెల్, హెట్‌మెయిర్
Comments
Please login to add a commentAdd a comment