
PC: (AP Photo)
జితేష్ శర్మ తన ప్రదర్శనతో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న జితేష్ శర్మ 1 ఫోర్, 3 సిక్స్‌లతో 35 పరుగులు చేశాడు. టీమిండియా 175 పరుగుల స్కోర్ నమోదు చేయడంలో జితేష్ తన వంతు పాత్ర పోషించాడు. రింకూ సింగ్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఈ ఏడాది చైనా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో జితేష్ శర్మ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే జితేష్ శర్మ సీనియర్ జట్టు తరపున ఆడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన జితేష్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"ఈ మ్యాచ్‌లో జితేష్ శర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి బ్యాటింగ్ చేసిన విధానం నమ్మశక్యం కానిది. ఈ మ్యాచ్‌కి ముందు అతడి ఫియర్‌లెస్ బ్యాటింగ్ గురించి మాట్లాడాను. మరోసారి అతడు తన బ్యాటింగ్ టాలెంట్‌ను చూపించాడు. వేరే ఆటగాడు జితేష్ శర్మ పొజిషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి వుంటే కచ్చితంగా కొన్ని బంతులను ఎదుర్కొని క్రీజులో సెటిల్ కావడానికి ప్రయత్నిస్తారు.
కానీ అతడు బ్యాటింగ్‌కు వచ్చిన వెంటనే క్రిస్ గ్రీన్‌ను ఆటాక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే వరుసగా సిక్స్‌లు బాది బౌలర్‌ను ఒత్తడిని నెట్టాడు. దీంతో భారత్ స్కోర్ బోర్డు ఒక్కసారిగా ముందుకు కదలింది. అతడి బ్యాటింగ్ ఎటాక్ నన్ను ఎంతగానో అకట్టుకుంది. టీమిండియాకు జితేష్ రూపంలో మరో ఫినిషర్ దొరికినట్లే" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయర్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో ఐదో టీ20.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్! తిలక్ రీ ఎంట్రీ