ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను రూ. 13 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రాంచైజీ నుంచి భారీగా సొమ్ము రావడంతో రింకూ సింగ్ ఎట్టకేలకు తన సొంతంటి కలను నేరవేర్చుకున్నాడు.
అలీఘర్‌లోని ఓజోన్ సిటీలో ఖరీదైన విల్లాను రింకూ సింగ్ కొనుగోలు చేశాడు. 500 చదరపు గజాల స్థలం గల ఇంటిని రూ. 3.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించి రింకూ సొంతం చేసుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా ఒకప్పుడు ఇదే ఓజోన్ సిటీలోని రింకూ తండ్రి గ్యాస్ సిలిండర్లు వేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇప్పుడు అదే సొసైటీలో కొడుకు విల్లాను కొనుగోలు చేసి తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. దీంతో రింకూపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది కాదా సక్సెస్ అని రింకూను కొనియాడుతున్నారు.
ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు..
కాగా ఐపీఎల్-2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది రింకూ ఓవర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత భారత జట్టులోకి రింకూ ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా రింకూ తన మార్క్‌ను చూపించాడు. కాగా ఐపీఎల్ 2024 సీజన్ రింకూ సింగ్‌కు రూ. 55 లక్షల వేతనం మాత్రమే వచ్చేది. కానీ తన అద్బుతప్రదర్శనలతో రింకూ ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు.
ఈ ఏడాది నుంచి అతడు రూ. 13 కోట్లు అందుకుంటాడు. కేకేఆర్ అంటిపెట్టుకున్న వారిలో రింకూనే టాప్ రిటెన్షన్ కావడం గమనార్హం. రింకూ సింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు.
చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment