రింకూ సింగ్ (PC: IPL/BCCI)
India Tour Of Ireland For T20Is 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్‌కు టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కుతుందని అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. అదే సమయంలో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌లు భారత జట్టులో స్థానం సంపాదించారు.
రింకూకు అన్యాయం
ఐపీఎల్-2023లో మెరుగైన ప్రదర్శనతో విండీస్ టూర్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు కొత్తగా ఈ ఇద్దరికీ చోటిస్తూ మొత్తంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌కు అన్యాయం జరిగిందంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా #JusticeForRinku అంటూ సెలక్టర్ల తీరును విమర్శించారు.
అందుకే వాళ్లను ఎంపిక చేయలేదు
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ పర్యటనకు రింకూను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్‌లో సత్తా చాటిన రింకూ సహా ఇతర యువ ఆటగాళ్లు ఐర్లాండ్ పర్యటనకు వెళ్తారు.
నిజానికి ఒకేచోట.. ఒకేసారి అందరినీ ఆడించడం కుదరదు కాబట్టే కొంతమందికి వెస్టిండీస్‌కు వెళ్లే జట్టులో చోటు దక్కలేదు. వాళ్లు ఐర్లాండ్ టూర్‌కు తప్పకుండా వెళ్లే అవకాశం ఉంది’’ అని సదరు అధికారి తెలిపారు. టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సహా రింకూ సింగ్ తదితరులు ఐరిష్ జట్టుతో తలపడే టీమిండియాకు ఎంపికవుతారనే సంకేతాలు ఇచ్చారు.
కరేబియన్ దీవిలో వాళ్లంతా
కాగా జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో గడుపనుంది. టెస్టు సిరీస్‌తో ఈ టూర్ ఆరంభం కానుండగా ఇప్పటికే ఆటగాళ్లంతా కరేబియన్ దీవికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇక టెస్టు, వన్డే సిరీస్‌లు ముగిసిన తర్వాత ఆగష్టు 4- ఆగష్టు 13 వరకు టీమిండియా- విండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగునుంది.
ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టు ఇందులో పాల్గొననుంది. ఈ టీమ్‌లో టాపార్డర్‌లో ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్.. వీరికి బ్యాకప్‌గా యశస్వి జైశ్వాల్, మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సంజూ శాంసన్, తిలక్ వర్మలకు చోటు దక్కింది.
ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనలో
ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా(పేస్), అక్షర్ పటేల్(స్పిన్) ఉండగా.. యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి స్పిన్ విభాగంలో చోటు సంపాదించారు. ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్‌లతో కూడిన పేస్ దళాన్ని సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా విండీస్ పర్యటన తర్వాత ఆగష్టు 18- 23 మధ్య భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
చదవండి: MS Dhoni: ధోని బర్త్‌డే.. రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్! వైరల్
టీమిండియా నుంచి ఉద్వాసన.. కసితో శతక్కొట్టిన పుజారా
Comments
Please login to add a commentAdd a comment