సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్‌ విధ్వంసం​.. వరుసగా మూడు సిక్స్‌లు! వీడియో వైరల్‌ | Rinku Singh Does It Again, Smashes 3 Consecutive Sixes In Super Over - Sakshi
Sakshi News home page

సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్‌ విధ్వంసం​.. వరుసగా మూడు సిక్స్‌లు! వీడియో వైరల్‌

Published Fri, Sep 1 2023 9:51 AM | Last Updated on Fri, Sep 1 2023 11:42 AM

Rinku Singh Smashes 3 Consecutive Sixes - Sakshi

టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్‌ మరోసారి తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. ఐపీఎల్‌ను గుర్తుచేసే విధంగా సూపర్‌ ఓవర్‌లో ఓ మ్యాచ్‌ను రింకూ ఫినిష్‌ చేశాడు. రింకూ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.  ఈ లీగ్‌లో భాగంగా గురువారం మీరట్ మావెరిక్స్,కాశీ రుద్రస్‌ జట్లు తలపడ్డాయి.

తొలుత బ్యాటింగ్‌ చేసిన మీరట్ మావెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. మీరట్ బ్యాటర్లలో కెప్టెన్‌ మాదవ్‌ కౌశిక్‌(87 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే రింకూ మాత్రం తొలుత కేవలం 15 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. అనంతరం లక్ష్య చేధనలో కాశీ రుద్రస్‌ సరిగ్గా 181 పరుగులే చేసింది.

దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కాశీ రుద్రస్‌ 16 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ మొదలెట్టిన మీరట్ 4 బంతుల్లోనే టార్గెట్‌ను ఛేదించింది. కాశీ స్పిన్నర్‌ శివమ్‌ సింగ్‌ వేసిన సూపర్‌ ఓవర్‌లో రింకూ సింగ్‌ వరుసగా మూడు సిక్స్‌లు బాది మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌-2023 సందర్భంగా గుజరాత్‌ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది రింకూ మ్యాచ్‌ను కేకేఆర్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. ఇక ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ ​క్రికెట్‌లోకి రింకూ అడుగుపెట్టాడు.
చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. సూర్యకుమార్‌కు నో ఛాన్స్‌! యువ సంచలన అరంగేట్రం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement