South Africa vs India, 2nd T20I: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో సూర్య సేనను పరాజయం పలకరించింది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన టీ20లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది.
తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. దీంతో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఓటమిపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. మెరుగైన స్కోరు సాధించినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామన్నాడు.
ఓపెనర్లు పూర్తిగా విఫలం
కాగా సౌతాఫ్రికాతో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్ గిల్ డకౌట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ 56 పరుగులతో అదరగొట్టాడు. మరోవైపు.. రింకూ సింగ్ 68 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
#AidenMarkram brought himself on in the penultimate over, and #RinkuSingh made him pay with back-to-back maximums 🔥
— Star Sports (@StarSportsIndia) December 12, 2023
Rinku has brought his A-game to South Africa!
Tune-in to the 2nd #SAvIND T20I
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/HiibVjyuZH
ఆటంకం కలిగించిన వరణుడు
అయితే, 19.3 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో భారత ఇన్నింగ్స్‌ను అక్కడితో ఆపేశారు. అప్పటికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ క్రమంలో డక్‌వర్త్ లూయీస్ ప్రకారం.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి.. విజయ లక్ష్యాన్ని 152 పరుగులుగా నిర్దేశించారు.
ఈ క్రమంలో 13.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు సాధించిన ప్రొటిస్ జట్టు జయకేతనం ఎగురవేసింది. డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం ఐదు వికెట్ల తేడాతో సఫారీలు టీమిండియాపై గెలుపొందారు. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘సగం ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు.. మేము మెరుగైన స్కోరే చేశామని భావించాం.
అందుకే ఓడిపోయాం
అయితే, వాళ్లు మాకంటే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా మొదటి 5-6 ఓవర్లలోనే మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా బెరుకు లేకుండా మమ్మల్ని మేము నిరూపించుకోవాలన్న తపనతోనే మైదానంలో దిగాం.
A positive start for South Africa in their chase of 152 in 15 overs 😮
— Star Sports (@StarSportsIndia) December 12, 2023
Can #TeamIndia find the early breakthrough?
Tune-in to the 2nd #SAvIND T20I
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/q7lV4PEGHU
అందుకు తగ్గట్లుగానే మా ప్రణాళికలను అమలు చేశాం. వికెట్ పచ్చిగా ఉండటంతో ఆరంభంలో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగా తోచింది. భవిష్యత్ మ్యాచ్‌లలోనూ ఇలాంటి కఠిన పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది. మాకు ఇదొక గుణపాఠం’’ అని పేర్కొన్నాడు.
పాఠాలు నేర్చుకుంటాం
ఇక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్న సూర్య.. ప్రస్తుతం దృష్టి మొత్తం తదుపరి మ్యాచ్‌పైనే కేంద్రీకృతం చేశామని వెల్లడించాడు. కాగా ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో టీ20లలో తలపడిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఏకంగా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇక ఈ సిరీస్‌కు కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment