Ind vs SA: నాలుగు మ్యాచ్‌లలో కలిపి 16..! స్టార్‌ ఓపెనర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌ | Ind vs SA 2nd T20I: Fans Brutally Trolls Shubman Gill Yashasvi Jaiswal For Ducks | Sakshi
Sakshi News home page

Ind vs SA: నాలుగు మ్యాచ్‌లలో కలిపి 16..! ఇలాంటి ఆటగాడిని ఎంపిక చేస్తే..

Published Wed, Dec 13 2023 9:42 AM | Last Updated on Wed, Dec 13 2023 10:22 AM

Ind vs SA 2nd T20I: Fans Brutally Trolls Shubman Gill Yashasvi Jaiswal For Ducks - Sakshi

టీమిండియా

South Africa vs India, 2nd T20I: టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠినమైన పిచ్‌లపై ఆడే సత్తా అతడికి లేదంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఫామ్‌ను బట్టే తుదిజట్టు ఎంపిక ఉండాలని.. అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలరంటూ మేనేజ్‌మెంట్‌కు చురకలు అంటిస్తున్నారు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత శుబ్‌మన్‌ గిల్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై.. తొలిసారిగా ప్రపంచకప్‌ ఈవెంట్లో ఆడిన ఈ పంజాబీ బ్యాటర్‌..  తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు సాధించాడు. అయితే, ఆస్ట్రేలియాతో కీలక ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు.

విఫలమైన గిల్‌
తనకు అచ్చొచ్చిన నరేంద్ర మోదీ స్టేడియంలో కేవలం నాలుగు పరుగులకే అవుటై విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ట్రోలింగ్‌ బారిన పడ్డ గిల్‌​.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ సందర్భంగా విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనతో పునరాగమనం చేసిన శుబ్‌మన్‌ గిల్‌.. రెండో టీ20లో దారుణంగా విఫలమయ్యాడు.

పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం నాటి మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. ప్రొటిస్‌ పేసర్‌ లిజాడ్‌ విలియమ్స్‌ బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. మరో యువ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ కూడా సున్నా స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. ఇలా ఓపెనర్లు ఇద్దరూ చేతులెత్తేయడంతో మిడిలార్డర్‌పై భారం పడింది. అయితే, తిలక్‌ వర్మ ధనాధన్‌ ఇన్నింగ్స్‌(29), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(56), నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌(68- నాటౌట్‌) రాణించారు.

అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించింది. ఈ నేపథ్యంలో అద్బుతంగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

విదేశీ గడ్డపై గిల్‌ రాణించలేడంటూ ట్రోలింగ్‌!
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిన మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను కాదని శుబ్‌మన్‌ గిల్‌కు ఛాన్స్‌ ఇచ్చినందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. టాప్‌ స్కోరర్‌గా నిలిచి.. మంచి ఫామ్‌లో ఉన్న రుతును పక్కనపెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అనారోగ్య కారణాల దృష్ట్యా రుతురాజ్‌ గైక్వాడ్‌ సెలక్షన్‌కు అందుబాటులో లేడని బీసీసీఐ చెబుతున్నా ఎందుకో నమ్మశక్యంగా లేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ప్రయోగాలు చేయొద్దని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నాలుగు మ్యాచ్‌లలో కలిపి 16!
ఈ సందర్భంగా విదేశీ గడ్డపై గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్‌ గిల్‌ కేవలం 16 పరుగులు(3,7,6,0) మాత్రమే చేశాడంటూ గణాంకాలు ఉటంకిస్తూ మరీ అతడి ఆట తీరును విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌-2024 అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జూన్‌ 4 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియాకు ప్రస్తుతం సౌతాఫ్రికాతో ఒకటి, అఫ్గనిస్తాన్‌తో మూడు టీ20లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement