టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా వచ్చే నెల 6, 9, 12వ తేదీల్లో మూడు మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలోనే జట్టును ప్రకటించనుంది.
ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ పొట్టి సిరీస్‌కు శుబ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌కు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. కాగా సొంతగడ్డపై నవంబరులో టీమిండియా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే భారత్‌కు ఈ సిరీస్ కీలకం.
గిల్, జైస్వాల్‌పై పనిభారం పడకుండా
ఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్‌పై పనిభారం పడకుండా చూసుకునేందుకు.. మేనేజ్‌మెంట్ ఈ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత.. గిల్- జైస్వాల్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా ప్రధాన ఓపెనింగ్ జోడీగా మారారు.
వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!
అయితే, కివీస్‌తో సిరీస్ కారణంగా వీరిద్దరు గనుక దూరమైతే.. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు లక్కీ ఛాన్స్ వచ్చినట్లే! వీరిద్దరు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. అయితే, రుతురాజ్ ఇరానీ కప్-2024 మ్యాచ్ కారణంగా తొలి టీ20కి దూరం కానున్నాడని.. అందుకే జైస్వాల్ ఆ ఒక్కమ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.
కాగా ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘సి’ కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్.. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ మ్యాచ్ అక్టోబరు 1-5 వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపిక కానుండగా.. జితేశ్ శర్మను అతడికి బ్యాకప్‌గా సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
విధ్వంసకర సెంచరీ హీరో అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో స్థానం దక్కించుకున్న పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తొలిటీ20 సందర్భంగా అరంగేట్రం చేశాడు.
అయితే, తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయి విమర్శపాలైన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో టీ20లో శతకంతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకుని.. ఆ తర్వాత అవుటయ్యాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు అతడికి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. ఇక టీమిండియా విషయానిస్తే.. బంగ్లాతో తొలి టెస్టు గెలిచి.. శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది.
చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment