Ind vs SA: రింకూ, సూర్య మెరుపులు వృథా .. దక్షిణాఫ్రికాదే రెండో టి20  | South Africa won second T20 | Sakshi
Sakshi News home page

Ind vs SA: రింకూ, సూర్య మెరుపులు వృథా .. దక్షిణాఫ్రికాదే రెండో టి20 

Dec 13 2023 4:17 AM | Updated on Dec 13 2023 9:10 AM

South Africa won second T20 - Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: భారత్‌తో టి20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ ఓడిన టీమిండియా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై ముందుగా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ (39 బంతుల్లో 68 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు.

సఫారీ బౌలర్లలో గెరార్డ్‌ కొయెట్జీకి 3 వికెట్లు దక్కాయి. భారత్‌ ఇన్నింగ్స్‌లో మరో 3 బంతులు మిగిలి ఉండగానే వర్షం రావడంతో ఆట ఆగిపోగా... వాన తగ్గిన తర్వాత భారత ఇన్నింగ్స్‌ను కొనసాగించకుండా అక్కడితో ముగించారు. అనంతరం దక్షిణాఫ్రికా విజయలక్ష్యాన్ని (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) 15 ఓవర్లలో 152 పరుగులుగా నిర్దేశించారు.

చివరకు సఫారీ టీమ్‌ 13.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు సాధించి గెలిచింది. రీజా హెన్‌డ్రిక్స్‌ (27 బంతుల్లో 49; 8 ఫోర్లు, 1 సిక్స్‌), మార్క్‌రమ్‌ (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. తొలి టి20 వర్షంతో రద్దు కాగా, తాజా ఫలితంతో సఫారీ 1–0తో పైచేయి సాధించింది. చివరిదైన మూడో టి20 రేపు జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది.    

కీలక భాగస్వామ్యాలు... 
ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కాగా... ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (0), శుబ్‌మన్‌ గిల్‌ (0) డకౌట్‌ కావడంతో 6 పరుగులకే భారత్‌ 2 వికెట్లు కోల్పోయింది. అయితే మూడో స్థానంలో వచ్చిన తిలక్‌ వర్మ (20 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి స్కోరుబోర్డును పరుగెత్తించాడు. సూర్య కూడా తనదైన శైలిలో జోరు ప్రదర్శించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 24 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు.

10 ఓవర్లలో స్కోరు 84 పరుగులకు చేరగా, 29 బంతుల్లో సూర్య అర్ధ సెంచరీ పూర్తయింది. తన తొలి 20 బంతుల్లో 6 ఫోర్లు బాది రింకూ కూడా ధాటిని కొనసాగించాడు. సూర్య, రింకూ నాలుగో వికెట్‌కు 48 బంతుల్లో 70 పరుగులు జత చేశారు. సూర్య వెనుదిరిగిన తర్వాత జితేశ్‌ శర్మ (1) విఫలం కాగా, 30 బంతుల్లో రింకూ కెరీర్‌లో తన తొలి హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు.  

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) మిల్లర్‌ (బి) జాన్సెన్‌ 0; గిల్‌ (ఎల్బీ) (బి) విలియమ్స్‌ 0; తిలక్‌ (సి) జాన్సెన్‌ (బి) కొయెట్జీ 29; సూర్యకుమార్‌ (సి) జాన్సెన్‌ (బి) షమ్సీ 56; రింకూ (నాటౌట్‌) 68; జితేశ్‌ (సి) స్టబ్స్‌ (బి) మార్క్‌రమ్‌ 1; జడేజా (ఎల్బీ) (బి) కొయెట్జీ 19; అర్‌‡్షదీప్‌ (సి) ఫెలుక్వాయో (బి) కొయెట్జీ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో 7 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–0, 2–6, 3–55, 4–125, 5–142, 6–180, 7–180. బౌలింగ్‌: జాన్సెన్‌ 3–0–39–1; విలియమ్స్‌ 3–0–32–1; కొయెట్జీ 3.3–0–32–3; ఫెలుక్వాయో 3–0–29–0; షమ్సీ 4–0–18–1; మార్క్‌రమ్‌ 3–0–29–1.  

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: బ్రీట్‌జె (రనౌట్‌) 16; హెన్‌డ్రిక్స్‌ (సి) సూర్యకుమార్‌ (బి) కుల్దీప్‌ 49; మార్క్‌రమ్‌ (సి) సిరాజ్‌ (బి) ముకేశ్‌ 30; క్లాసెన్‌ (సి) యశస్వి (బి) సిరాజ్‌ 7; మిల్లర్‌ (సి) సిరాజ్‌ (బి) ముకేశ్‌ 17; స్టబ్స్‌ (నాటౌట్‌) 14; ఫెలుక్వాయో (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (13.5 ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–42, 2–96, 3–108, 4–108, 5–139. బౌలింగ్‌: సిరాజ్‌ 3–0–27–1, అర్‌‡్షదీప్‌ 2–0–31–0, జడేజా 2.5–0–28–0, ముకేశ్‌ 3–0–34–2, కుల్దీప్‌ 3–0–26–1.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement