రింకూ సింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి.. ఫోటో వైరల్‌ | Virat Kohli Gifts A Precious Gift To Bat Rinku Singh After KKR Beat RCB, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Kohli Bat Gift To Rinku Singh: రింకూ సింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి.. ఫోటో వైరల్‌

Published Sat, Mar 30 2024 10:10 PM | Last Updated on Sun, Mar 31 2024 6:43 PM

Virat Kohli Gifts A Bat Rinku Singh - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఓట‌మి చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి(83) అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడిన‌ప్ప‌టికి.. త‌న జ‌ట్టు మాత్రం 7 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మి చ‌విచూసింది. కాగా కోహ్లి ఓట‌మి బాధ‌లో ఉన్న‌ప్ప‌టికి  మాత్రం త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు.

మ్యాచ్‌ అనంతరం కింగ్‌ కోహ్లి కోల్‌కతా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లను కలిశాడు. యువ క్రికెటర్లకు విరాట్‌ విలువైన సూచనలు చేశాడు. ఈ క్రమంలో కేకేఆర్‌ ఫినిషర్‌ రింకూ సింగ్‌కు కోహ్లి స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. కోహ్లి తన బ్యాట్‌ను రింకూకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రింకూ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

తనకు బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు కోహ్లికి రింకూ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. "సలహాలు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు భ‌య్యా.. అదేవిధంగా బ్యాట్‌ ఇచ్చినందుకు కూడా థాంక్స్‌" అంటూ ఇన్‌స్టా స్టోరీలో రింకూ రాసుకొచ్చాడు.
చదవండి: IPL 2024: బెయిర్ స్టో స్ట‌న్నింగ్ క్యాచ్‌.. రాహుల్‌కు మైండ్ బ్లాంక్‌! వీడియో వైర‌ల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement