ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్టులో తలపడేందుకు భారత-ఎ జట్టు సిద్దమవుతోంది. జనవరి 24 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టు కోసం భారత జట్టులోకి మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్‌ను సెలక్టర్లు చేర్చారు.
తొలుత కేవలం మూడో అనధికారిక టెస్టుకు మాత్రమే రింకూను ఎంపిక చేసిన సెలక్టర్లు.. ఇప్పుడు రెండో టెస్టుకు కూడా అతడికి ఛాన్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా మంగళవారం ప్రకటించింది. కాగా రింకూ ప్రస్తుతం రంజీ ట్రోఫీ-2024లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడతున్నాడు. అయితే సెలక్టర్లు నుంచి పిలుపు రావడంతో అనుకున్నదానికంటే ముందే భారత-ఏ జట్టుతో రింకూ కలవనున్నాడు.
ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో టెస్టుకు భారత జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాష్ దీప్, యశ్ దయాల్, రింకు సింగ్
Comments
Please login to add a commentAdd a comment