బాల్‌ బాయ్‌కు సారీ చెప్పిన రింకూ సింగ్‌.. అసలేం జరిగిందంటే..? | Rinku Singh Offers KKR Cap To Ball Boy After Training Accident, Know What Happened Exactly Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024: బాల్‌ బాయ్‌కు సారీ చెప్పిన రింకూ సింగ్‌.. అసలేం జరిగిందంటే..?

Published Tue, Mar 12 2024 9:00 PM | Last Updated on Wed, Mar 13 2024 10:42 AM

Rinku Singh offers KKR cap to ball boy after training accident - Sakshi

Courtesy: Twitter-Kolkata Knight Riders

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభానికి సమయం అసన్నమైంది. మార్చి 22న చెపాక్‌ వేదికగా సీఎస్‌కే, ఆర్సీబీ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఐపీఎల్‌-2024 సీజన్‌కు సమయం దగ్గరపడడంతో  అన్నీ జట్లు తమ ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి.

ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సైతం ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రీ ట్రైనింగ్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాక్టీస్‌ క్యాంప్‌లో కేకేఆర్‌ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా నయా ఫినిషర్‌, కేకేఆర్‌ స్టార్‌ రింకూ సింగ్‌ తన మంచి మనసును చాటుకున్నాడు. రింకూ సింగ్‌..  ఓ బాల్‌ బాయ్‌కు క్షమాపణలు చెప్పాడు.

అసలేం జరిగిందంటే?
ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో భారీ షాట్లను రింకూ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక బంతిని రింకూ స్ట్రెయిట్ డ్రైవ్‌ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి బౌండరీ వెలుపల ఉన్న బాల్‌బాయ్‌ నుదుటికి తాకింది. ఇది చూసిన రింకూ సింగ్ ఆ కుర్రాడి దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. అదేవిధంగా రింకూ కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌  అభిషేక్ నాయర్‌ వద్ద టోపీ తీసుకుని ఆ యువకుడికి గిప్ట్‌గా ఇచ్చాడు.

ఆ టోపీపైన రింకూ సంతకం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రింకూపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement